ఫోర్బ్స్ 2021 జాబితా: శక్తివంతమైన మహిళలలో నిర్మలా సీతారామన్, కమలా హ్యారిస్; ఏ స్థానాల్లో ఉన్నారంటే
2021 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో భారత దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్థానం దక్కించుకున్నారు. వరుసగా మూడవ సారి నిర్మలాసీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఆమె మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం.

ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ కు చోటు
భారతదేశానికి తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలాసీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో 2019 34వ స్థానంలో నిలువగా, 2020లో 41వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది గతేడాది కంటే మెరుగైన స్థానంలో 37వ స్థానంలో నిర్మల సీతారామన్ నిలిచారు. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 40 మంది సీఈవో లు ఉన్నారు. ప్రపంచంలో 19 మంది మహిళా నేతలు, ఓ ఇమ్యునాలజిస్ట్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడం విశేషం.

ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 40 మంది సీఈవో లు
భారతదేశానికి తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలాసీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో 2019 34వ స్థానంలో నిలువగా, 2020లో 41వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది గతేడాది కంటే మెరుగైన స్థానంలో 37వ స్థానంలో నిర్మల సీతారామన్ నిలిచారు. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 40 మంది సీఈవో లు ఉన్నారు. ప్రపంచంలో 19 మంది మహిళా నేతలు, ఓ ఇమ్యునాలజిస్ట్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడం విశేషం. అత్యంత శక్తివంతమైన మహిళలుగా గుర్తించబడిన వీరు 3.3 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ పర్యవేక్షిస్తున్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.

మొదటి స్థానంలో మెకంజీ స్కాట్, రెండో స్థానంలో కమలా హ్యారిస్
మెకంజీ స్కాట్ ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలవగా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ రెండవ స్థానంలో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టన్ లగార్డే మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో హెచ్ సి ఎల్ కార్పొరేషన్ సీఈవో రోషిని నాడార్ మల్హోత్రా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయక్ ఉన్నారు. అంతేకాదు బంగ్లా దేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో ఒకరిగా జాబితాలో గుర్తింపు పొందారు.
Recommended Video

గతేడాది కూడా నిర్మలా సీతారామన్ కు, కమలా హ్యారిస్ కు స్థానం
100 అత్యంత శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ 2020 జాబితాలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా 10 వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సారి ఆ స్థానాన్ని దాతృత్వం గల మహిళ మెకంజీ స్కాట్ దక్కించుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ఈ జాబితాలో 2020లో మూడో స్థానంలో ఉన్నారు. ఈసారి రెండో స్థానంలో నిలిచారు. ఇక నిర్మలా సీతారామన్ గతంతో పోలిస్తే మెరుగైన స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఐరోపా యొక్క అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ యొక్క అధికారంలో 16 సంవత్సరాలు ఆశ్చర్యపరిచే విధంగా సేవలందిస్తూ, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫోర్బ్స్ జాబితాలో సుదీర్ఘకాలంగా మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి ఆ ట్రెండ్ మారినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications