ఫోర్బ్స్ 2024 జాబితాలో ఆరోసారి సగర్వంగా.. ప్రపంచ శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్!!

2024 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా ఆరవ సారి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ మరోమారు చోటు సంపాదించటం మాత్రమే కాదు మరో నాలుగు స్థానాల ముందుకు చేరారు.

ఆరోసారి నిర్మలమ్మ ఘనత
భారతదేశంలో ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో ముగ్గురు శక్తివంతమైన మహిళలకు చోటు దక్కింది. గత ఏడాది నలుగురికి, అంతకు ముందు ఏడాది మొత్తం ఆరుగురికి స్థానం దక్కింది. అయితే 2024 శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ ముందు వరుసలో నిలిచారు. నిర్మల సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇది వరుసగా ఆరవ సారి.

Forbes 2024 List Nirmala Sitharaman named world s most powerful woman for the sixth time in a row

గతం కంటే మెరుగైన స్థానంలో నిర్మలా సీతారామన్
ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ ఈ ఏడాది 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది ఆమె 32వ స్థానాన్ని దక్కించుకున్నారు. 2022 సంవత్సరంలో ఆమె 36వ స్థానంలో ఉన్నారు. అంతకు ముందు ఏడాది కంటే గతేడాది, గత సంవత్సరం కంటే ఇప్పుడు మరింత మెరుగైన స్థానాన్ని పొందారు.

నిర్మలా సీతారామన్ తర్వాత స్థానాల్లో వీరే
నిర్మల సీతారామన్ తర్వాత భారతదేశం నుంచి హెచ్సీఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆమె 81వ స్థానంలో నిలిచారు. గతేడాది 60వ స్థానంలో నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. గతేడాది ఆమె 76 వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.

టాప్ లో మళ్ళీ యూరోపియన్ కమిషన్ చీఫ్, రెండో స్థానంలో ఎవరంటే
అయితే గతేడాది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సోమ మోండల్ 70వ స్థానంలో నిలిచారు. కానీ ఈ ఏడాది ఆమె 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన మహిళల జాబితాలో ఈ సంవత్సరం కూడా యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయన్ తొలి స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్ ఉన్నారు.

మూడో స్థానంలో ఇటలీ ప్రధాని
మూడో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఉన్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన మహిళల జాబితాలో మూడో స్థానంలో కమల హ్యారిస్ ఉన్నారు. పరపతి, మీడియా, ప్రభావం, మరియు ప్రభావిత రంగాలు ఆధారంగా, వీటిని కొలమానంగా తీసుకొని ఫోర్బ్స్ జాబితా రూపొందించి ప్రతీ సంవత్సరం వెల్లడిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా జాబితా వెల్లడించింది.

నిర్మలా సీతారామన్ ఘనతపై ప్రముఖుల హర్షం
ఇక ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ స్థానం దక్కించుకోవటంపై భారతదేశంలోని ప్రముఖుల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. నిర్మలా సీతారామన్ రాజకీయాలు, విధానపర నిర్ణయాలు భారతీయ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తున్న క్రమంలో ఆమె శక్తివంతమైన మహిళగా స్థానం దక్కించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+