అడవి మధ్యలో అందమైన జలపాతం.. బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. ఎక్కడంటే..?
దక్షిణ భారత్ అందమైన జలపాతాలు, దట్టమైన అడవులకు నెలవుగా ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక జలపాతాలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న జలపాతం గురించి తెలుసా..? పశ్చిమ కనుమలలోని వివిధ మూలికా మొక్కల మధ్యలోంచి ఈ జలపాతానికి నీరు చేరుతుంది. ఈ వాటర్ ఫాల్స్ కింద స్నానం ఆచరిస్తే అనేక రుగ్మతల నుంచి కోలుకోవచ్చని స్థానికులు చెబుతుంటారు.
అదే తమిళనాడులోని తేని జిల్లా పెరియకులం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో కుంభకరై జలపాతం ఉంది. పశ్చిమ కనుమలలో కురిసే వర్షం నీరు.. వాగుల ద్వారా ఈ జలపాతానికి చేరుతుంది. అలాగే ఈ జలపాతం సహజమైన వాతావరణంలో పచ్చదనంతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతాల మధ్యలో ఈ జలపాతం ఉంది. ఇక్కడ చిరుతపులి, అరుదైన కోతులు, జింకలు మనకు దర్శనమిస్తాయి.
ఈ జలపాతం దగ్గరకు ట్రెక్కింగ్ ద్వారా కూడా చేరుకోవచ్చు. దట్టమైన అడవుల మధ్య ట్రెక్కింగ్ సాహసోపేతమైన జర్నీగా ఉంటుంది. కుంభకరై జలపాతం ప్రవేశ రుసుము రూ. 15 గా ఉంది. అలాగే కుంభకరై జలపాతం సందర్శన సమయం.. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఇక పార్కింగ్ ఫీజు చూస్తే బైక్ కు రూ. 15, కారుకు రూ. 50, బస్సులకు రూ. 100 గా నిర్ణయించారు. కుంభకరై జలపాతం వద్ద ఆంక్షలు చూస్తే.. నిషేధిత అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదు. జలపాతంలో స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపులు అనుమతించరు ఎందుకంటే అవి జంతువులకు హానికరంగా మారతాయి.

ఇక కుంభకరై జలపాతానికి సమీపంలోనే గుణ గుహలు, పిల్లర్ రాక్స్, గ్రీన్ వ్యాలీ, కొడైకెనాల్ సరస్సు, పైన్ ఫారెస్ట్, తలైయర్ జలపాతాలు ఉన్నాయి.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications