స్వాతంత్య్రపోరాటంలో చరిత్ర మరిచిన వీరులు:మాతాంగిని హజ్రా ఎవరు..?
భారత స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి భారతీయునికి కొత్త శకానికి నాంది పలికింది. బానిసత్వం నుంచి భరతమాత విముక్తి పొందింది. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోసి భారత్ స్వేచ్ఛావాయువును పీల్చింది. అందుకే ఏటా ఆగష్టు 15న అందరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.1947 ఆగష్టు 15న బ్రిటీష్ వలసవాదానికి ముగింపు పలికి భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది.
స్వాతంత్య్ర ప్రయాణంలో కీలక భాగమైన భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటీష్ పార్లమెంటు ఆమోదించింది.జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించి భారత దేశ మొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బ్రిటీషు వారిపై అలుపెరుగని పోరాటం చేసి గుర్తింపు దక్కని స్వాతంత్య్ర సమరయోధులు ఎంతో ముంది ఉన్నారు. ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు. చరిత్ర పుటల్లో మాత్రం మహాత్మా గాంధీ, నెహ్రూ పేర్లే ఎక్కువగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. అయితే స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన చాలామంది యోధుల పేర్లు కనుమరుగయ్యాయి. అలాంటి వారిలో కొందరున్నారు.

మాతాంగిని హజ్రా ఎవరు : మాతాంగిని హజ్రా.. ఈ పేరు గురించి చాలా మంది విని ఉండరు. ఈమె ఒక మహిళ. గాంధీ బురీ అని ముద్దుగా పిలుచుకుంటారు. బెంగాల్‌కు చెందిన ఈ మహిళా స్వాతంత్య్రసమరయోధురాలు... సహాయనిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనడమే కాకుండా కీలక పాత్ర పోషించారు. నిరసనలు, ఆందోళనల సమయంలో బ్రిటీషు వారు అణిచివేయాలని చూసిన సందర్భంలో మాతాంగిని ఎదురొడ్డి నిలిచారు. తెల్లపాలకులపై కన్నెర్ర చేశారు. ఇలా 1942లో ఒక ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో మాతాంగిని హజ్రాను బ్రిటీషు వారు హత్య చేశారు. జాతీయ జెండాను చేతపట్టి వందేమాతరం అని నినదిస్తూ భరతమాత వడిలో తుదిశ్వాస విడిచింది మాతాంగిని హజ్రా.

అల్లూరి సీతరామరాజు : ఇక ఇలా చరిత్రపుటలకే పరిమితమైన మరో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా గళం విప్పాడు అల్లూరిసీతరామరాజు. రంప తిరుగుబాటులో చాలా కీలకంగా వ్యవహరించాడు.స్థానిక గిరిజనులతో ఒక సైన్యం ఏర్పాటు చేసి బ్రిటీషు వారిపై పోరాటం చేశారు. కొండప్రాంతాల్లోనే ఉంటూ బ్రిటీషు వారిని గడగడలాడించాడు అల్లూరి. అయితే సొంతవారే అల్లూరి మరణానికి కారణమయ్యారు. బ్రిటీషు వారి ముందు ధైర్యంగా గుండెలు చూపి తూటాలు దింపాలని చెప్పాడు. ఆ తూటాలకు నేలకొరిగాడు. అయితే తను చాలామందిలో స్వాతంత్య్ర స్ఫూర్తి రగల్చారు.
ఇలా చాలామంది స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి బ్రిటీషు వారిపై వ్యతిరేకంగా గళమెత్తి స్ఫూర్తిని నింపారు. అయితే వారికి చరిత్రలో దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అలాంటి వారిని ఈ స్వాతంత్య్రం దినోత్సవం రోజున స్మరించుకుందాం.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications