బీజేపీ మాజీ సీఎంకు రెడ్ కార్పెట్ వేసిన కాంగ్రెస్, గంటలో బీఫామ్, చుక్కలు చూపిస్తా !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలీక రోజుకొక మలుపు తిరుగుతోంది. తాను పార్టీ మారుతానని కలలో కూడా ఊహించని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జగదీష్ శెట్టర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని బీజేపీ హైకమాండ్ కు పెద్ద షాక్ ఇచ్చారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగాప ని చేసిన వ్యక్తి, బీజేపీ బ్రాండ్ తో ఇంతకాలం చలామణి అయిన జగదీష్ శెట్టర్ ఎటువంటి పరిస్థితిలో పార్టీ మారరని బీజేపీ నాయకులు ఇంతకాలం అనుకున్నారు. అయితే పరిస్థితులు తారుమారు అయ్యాయి. సోమవారం ఉదయం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

Jagdish Shettar

జగదీష్ శెట్టర్ ఎలాంటి షరుతులు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఆయన హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం ఎమ్మెల్యే సీటు కూడా అగడలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మీడియాకు చెప్పారు. జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే ఆయన చేతిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ టిక్కెట్ బీఫామ్ చేతిలో పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే జగదీష్ శెట్టర్ కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంతో హుబ్బళిలోని ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. గతంలో కంటే భారీ మెజారిటీతో మా నాయకుడు జగదీష్ శెట్టర్ ను గెలిపించుకుంటామని హుబ్ళిలోని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికే బీజేపీతో సంబంధాలు తెంచుకున్న జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో విజయం సాధించి సత్తా చాటుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు.

Jagdish Shettar

ఇప్పటికే హుబళ్లి-ధారవాడ కార్పోరేషన్ లోని 16 మంది బీజేపీ కార్పోరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి జగదీష్ శెట్టర్ ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని ప్రకటించారు. ఇప్పుడు హుబ్ళి-ధారవాడ కార్పోరేషన్ లో కూడా బీజేపీకి చుక్కలు చూపించడానికి జగదీష్ శెట్టర్ సిద్దం అయ్యారు మొత్తం మీద జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్ అని బీజేపీ నాయకులే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+