బళ్లారి రెడ్డి బ్రదర్స్ కలయికకు వేధిక సిద్దం, ప్యాలెస్ గ్రౌండ్స్ లో బళ్లారి శ్రీరాముల కూతురి పెళ్లి !
కర్ణాటక రాజకీయాల్లో బళ్లారి జిల్లాకు చాలా ప్రత్యేక ఉంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి బళ్లారి జిల్లాకు చెందిన నాయకులు అండగా నిలిచారు. బళ్లారి జిల్లా పేరు చెబితే మొదట టక్కున చెప్పేపేరు గాలి జనార్దన్ రెడ్డి సోదరుల పేర్లు. గాలి బ్రదర్స్ ముగ్గురే. అయితే గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు కూడా రెండు దశాభ్దాల క్రితమే ఆ రెడ్డి బ్రదర్స్ లో ఒక్కడు అయ్యాడు.
తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో నుంచి బయటకు వచ్చేశాడు. అయినా గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డితో పాటు శ్రీరాములు బీజేపీలోనే ఉన్నారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ తో పోటీ చేసిన గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డితో పాటు శ్రీరాములు ముగ్గురూ ఓడిపోయారు.

బీజేపీ నుంచి బయటకు వచ్చిన తరువాత సొంత పార్టీ పెట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి కోప్పళ జిల్లాలోని గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీలోనే ఉంటున్న బళ్లారి శ్రీరాములు ఆయన రెండో కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
గతంలో మంత్రిగా పని చేస్తున్న సమయంలోనే బళ్లారి శ్రీరాములు ఆయన కుమార్తె పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు ఆయన రెండో కుమార్తె పెళ్లి చేస్తున్నాడు. డిసెంబర్ 7వ తేదీన బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా రెండో కుమార్తె పెళ్లి చెయ్యడానికి శ్రీరాములు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కర్ణాటకలోని అన్ని జిల్లాల్లోని బీజేపీ కార్యాలయాలకు వెలుతున్న మాజీ మంత్రి శ్రీరాములు ఆ పార్టీ నాయకులకు శుభలేఖలు ఇచ్చి కూతురి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇదే సందర్బంలో వాల్మీకి కులానికి చెందిన నాయకులు, పెద్దలు, స్నేహితులు, అన్ని పార్టీల్లో ఉంటున్న స్నేహితులు, సన్నిహితులకు శుభలేఖలు ఇస్తున్న శ్రీరాములు ఆయన రెండో కూతురి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. మొత్తం మీద బళ్లారి బ్రదర్స్ కలయికకు త్వరలో బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ వేదిక కానుంది.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, కర్ణాటక మాజీ మంత్రులు (బీజేపీ)తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అన్ని పార్టీల నాయకులను బళ్లారి శ్రీరాములు ఆయన రెండో కుమార్తె వివాహానికి అహ్వానిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
SPG కి షాక్ ఇచ్చిన ప్రధాని! ప్రోటోకాల్ బ్రేక్, మోదీ క్షమాపణలు -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications