వేణుస్వామిని కలిసిన మాజీ ప్రధాని కుమారుడి ఫ్యామిలీ, జాతకాలు ?
హైదరాబాద్/బెంగళూరు: సినీ నటీనటులు, రాజకీయ ప్రముఖుల జాతకలు చెబుతూ నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి పొరుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు, అభిమానులు ఎక్కువ అయ్యారు. మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిని కలిశారని సమాచారం.
బుధవారం హైదరాబాద్ లోని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇంటికి కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ, ఆయన సతీమణి భవాని రేవణ్ణ. దంపతుల కుమారుడు, హాసన్ జేడీఎస్ పార్టీ లోక్ సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ, కర్ణాటక విధాన పరిషత్ సభ్యుడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ వెళ్లారు. ఇదే సందర్బంలో ప్రముఖ జ్యోతిష్యుడిు వేణుస్వామితో మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ కుటుంబ సభ్యులు చర్చలు జరిపారు.

అనంతరం వేణుస్వామి హెచ్,డీ. రేవణ్ణ, భవాని రేవణ్ణలతో పూల దండలు మార్పించారని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి. ఆ ఫోటో ఇప్పుడు బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ఇదే సందర్బంలో కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ వివిద అంశాలపై వేణుస్వామితో చర్చించారని తెలిసింది. జేడీఎస్ పార్టీలోనే చాలా మందికి తెలీకుండా మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ హైదరాబాద్ వెళ్లి వేణుస్వామిని కలిశారని తెలిసింది.
మాజీ ప్రధాని హెచ్ డీ. కుమారస్వామి, ఆయన కుమారుడు, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ జాతకాలు ఎక్కువగా నమ్ముతారు. కర్ణాటకలోని ప్రముఖ జ్యోతిష్యులు అందరితో మాజీ ప్రధాని హెచ్. డీ. దేవగౌడ కుటుంబ సభ్యులకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణకు ఎక్కువ జాతకాల పిచ్చి ఉందని ప్రచారం ఉంది.
కర్ణాటకలో జేడీఎస్ అధికారంలో ఉన్న సమయంలో (బీజేపీతో, కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన సమయంలో) రేవణ్ణ మంత్రిగా పని చేశారు. ఆ సందర్బంలో చాలాసార్లు హెచ్,డీ. రేవణ్ణ చేతిలో నిమ్మకాయలు పెట్టుకుని విధాన సౌధలోకి ఎంట్రీ ఇచ్చి మీడియా కెమెరాలకు చిక్కిపోయారు. అయితే ఎవరి నమ్మకాలు వారివని, మేము దేవుడిని, జాతకాలను నమ్ముతామని అనేక సందర్బాల్లో మాజీ మంత్రి హెచ్. డీ. రేవణ్ణ అన్నారు.

అయితే హైదరాబాద్ లో వేణుస్వామిని కలవడానికి రేవణ్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఎందుకు వెళ్లారు, ఆకారణం ఏమిటి అనే విషయం ఇంత వరకు బయటకు రాలేదని జేడీఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద జేడీఎస్ పార్టీ నాయకుల్లో ఇప్పుడు వేణుస్వామి హాట్ టాపిక్ అయ్యారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications