కేరళ మాజీ మంత్రి కేపీ విశ్వనాథన్ కన్నుమూత..
కేరళ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కేపీ విశ్వనాథన్ గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. విశ్వనాథన్ శుక్రవారం తెల్లవారుజామున కేరళలోని త్రిస్సూర్‌లోగల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. కేపీ విశ్వనాథన్ వయసు 83 ఏళ్లు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు విశ్వనాథన్‌కి సంతాపం ప్రకటించారు.
గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడ్డారు : విశ్వనాథన్ వృత్తిరీత్యా ఓ న్యాయవాది. 1967 నుండి 1970 వరకు త్రిసూర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1972 నుండి KPCC క్రియాశీల సభ్యునిగా కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో ఎంతో చురుకుగా పనిచేసేవారు. 1977, 1980, 1987లో కున్నంకుళం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వనాథన్ గెలుపొందారు. 1987, 1991, 1996, 2001లో కొడకరా నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయపతాకాన్ని ఎగురవేసారు.

1991-1994, 2004-2005 మధ్య అటవీ, వన్యప్రాణుల మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కొడకరా నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి సి రవీంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామును కేరలలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలలున్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications