Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత..

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి ఆకాలీదళ్‌ అధినేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కన్నుమూశారు. 95 ఏళ్ల ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం మొహాలీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. బాదల్ ఆదివారం శ్వాసం తీసుకోవడంలో ఇబ్బింది రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ ఉంచి చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రకాష్ సింగ్ బాదల్ ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Former Punjab CM Parkash Singh Badal Passed Away

గత ఏడాది జూన్‌లో బాదల్ పొట్టలో పుండ్లు, బ్రోన్చియల్, ఆస్తమాతో ఆసుపత్రిలో చేరారు. శిరోమణి అకాలి దళ్ అధికార BJPకి మిత్రపక్షంగా ఉంది. అయితే పార్లమెంటులో మూడు అగ్రి-మార్కెటింగ్ బిల్లులను ఆమోదించడంపై 2020 సెప్టెంబర్‌లో ఎన్డీఏ నుంచి వైదొలిగింది.ప్రకాష్ సింగ్ బాదల్ 1927 డిసెంబర్ 8న ముక్త్‌సర్‌లో జన్మించారు.

20 ఏళ్ల వయసులో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన 1957లో కాంగ్రెస్ టిక్కెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1970లో 43 ఏళ్ల వయసులో తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాష్ సింగ్ బాదల్ 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి 11 గెలిచారు. 1969 నుంచి 2017 మధ్య వరుసగా విజయం సాధించారు.

ప్రకాష్ సింగ్ బాదల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. " ప్రకాష్ సింగ్ బాదల్ ముఖ్యమైన రాజకీయ ప్రముఖులలో ఒకరు. ప్రజాసేవలో ఆయన ఆదర్శప్రాయమైన కెరీర్ ఎక్కువగా పంజాబ్‌కే పరిమితమైనప్పటికీ, దేశవ్యాప్తంగా ఆయనకు గౌరవం ఉంది. ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి" అంటూ ట్వీట్ చేశారు.

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ మాజీ అధ్యక్షుడు సర్దార్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మరణవార్త బాధాకరమని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. "బాదల్ భారతదేశం, పంజాబ్ రాజకీయాలకు ముఖ్యమైన నాయకుడు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో పాటు కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+