జాక్ పాట్ కొట్టిన నాలుగేళ్ల బాలుడు.. లక్కీ డ్రాలో రూ.53 లక్షల కారు !!
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ తరహా ఘటనలు ఇప్పటికే చోటు చేసుకోగా.. ఇప్పుడు లేటెస్ట్ గా మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే నిజమైంది. కేవలం రూ.201 తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేస్తే వారికి ఊహించని రీతిలో భారీ బహుమతి దక్కింది. ఈ ఘటన బర్హాన్‌పూర్ జిల్లా శిలాంపుర ప్రాంతంలో చోటుచేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
గర్బా ఉత్సవంలో..
కాగా దసరా సందర్భంగా బర్హాన్‌పూర్ లోని అభాపురి ప్రాంతంలో "సర్కార్ ధామ్" ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గర్బా ఉత్సవాలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లక్కీ డ్రా కూపన్ స్కీమ్ ను కూడా ప్రవేశపెట్టారు. అందులో భాగంగా శిలాంపురకు చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ తన నాలుగేళ్ల మనవడు మేధాన్ష్ పేరుతో రూ.201 చెల్లించి ఒక కూపన్ కొనుగోలు చేశారు.

లక్కీ బాయ్..
తరువాత రోజు నిర్వహించిన లక్కీ డ్రాలో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ మేధాన్ష్ పేరు ఉన్న కూపన్ విజేతగా ఎంపికైంది. బహుమతిగా టయోటా ఫార్చ్యూనర్ SUV దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు రూ. 53 లక్షల విలువైన లగ్జరీ కారు.. కేవలం రూ.201 తో దక్కించుకోవడం అదృష్టం అని.. ఆ పిల్లడిని లక్కీ బాయ్ అని అంటూ తెగ పొగిడేస్తున్నారు.
అయితే మధ్యప్రదేశ్‌లో లాటరీలపై నిషేధం ఉంది. కానీ సాంస్కృతిక లేదా ధార్మిక ఉత్సవాల సందర్భంగా నిర్వహించే లక్కీ డ్రాలుపై మాత్రం ఆంక్షలు లేవు. అవి పన్ను చెల్లింపులతో, పారదర్శకంగా నిర్వహిస్తే చట్టపరంగా అనుమతించబడతాయి. ఈ గర్బా ఉత్సవం కూడా స్థానిక అధికారుల అనుమతితో జరిగినట్టు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత మేధాన్ష్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఈ మేరకు కిరణ్ రాయిక్వార్ మాట్లాడుతూ.. తమ మనవడు మేధాన్ష్‌కు చిన్నప్పటి నుంచే బొమ్మల కార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటినే అడుగుతాడు. కానీ ఈసారి అతనికి నిజమైన పెద్ద కారు దక్కింది. ఇది దేవుని వరం అని మేము భావిస్తున్నాం. పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత కారు మా ఇంటికి వస్తుందని అన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications