ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్.. కుమారుడి లైంగికదాడి కేసుపై రాజస్థాన్ మంత్రి..
రాజస్థాన్ మంత్రి కుమారుడిపై లైంగికదాడి ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై ఎట్టకేలకు మంత్రి మహేశ్ జోషి స్పందించారు. తన కుమారుడు రోహిత్ జోషిపై వచ్చిన రేప్ ఆరోపణలపై నిష్ఫక్షపాత విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. రోహిత్‌పై 23 ఏళ్ల మహిళ లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ తనను జైపూర్, ఢిల్లీల్లో పలుమార్లు రేప్ చేశారని ఆరోపించింది. ఇదీ రాజకీయంగా కలకలం రేపింది. దీనిపై మంత్రి నోరు విప్పారు.

పలుమార్లు లైంగికదాడి.
.
మహిళ ఫిర్యాదుతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతేడాది జనవరి 8వ తేదీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ వరకు పలు మార్లు లైంగికదాడి చేశారని వివరించింది. లైంగికదాడి ఆరోపణలకు సంబంధించి తన కుమారుడు ఏదైనా తప్పు చేస్తే.. తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అని స్పష్టంచేశారు.

రాజకీయ కక్ష.. నో కామెంట్
ఇదీ రాజకీయ కక్షగా భావిస్తున్నారా అని మంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై తాను ఇప్పుడు స్పందించలేనని చెప్పారు. ఏం జరిగిందనే విషయం త్వరలో తెలుస్తోందని పేర్కొన్నారు. రోహిత్‌పై ఉత్తర ఢిల్లీలో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. రేప్, డ్రగ్స్ వాడకం, పెళ్లి చేసుకుంటానని చెప్పడం.. నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మంత్రి ఇవాళ నోరు విప్పారు.

పెళ్లి పేరుతో రేప్..
గత ఏడాది నుంచి ఫేస్‌బుక్ ద్వారా రోహిత్ జోషితో స్నేహం ఏర్పడిందని మహిళ చెప్పింది. జైపూర్‌లో ఇద్దరు ఫస్ట్ టైం కలుసుకున్నారు. గతేడాది జనవరి 8వ తేదీన సవాయ్ మాధోపూర్‌కు తనను రమ్మన్నాడని చెప్పింది. తొలిసారి కలిసినప్పుడు డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చాడని.. తెల్లారి లేచేటప్పటికి తను అత్యాచారానికి గురై ఉన్నానని చెప్పింది. తనను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బెదిరించేవాడని ఆ మహిళ పేర్కొంది.

భార్య భర్తలు అని చెప్పి..?
రోహిత్ తనను ఓ హోటల్‌లో భార్యాభర్తలుగా పేర్లు నమోదు చేయించాడని కూడా మహిళ ఆరోపణలు చేసింది. ఆ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. దీనిపై ఇవాళ మంత్రి స్పందించారు. నిష్ఫక్షపాత దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications