Friends: సినిమా, 13 ఏళ్ల అబ్బాయిని హత్య చేసిన 16 ఏళ్ల అబ్బాయి, పక్కాస్కెచ్, అసలు మ్యాటర్ తెలిసి షాక్!

లక్నో/ఉత్తరప్రదేశ్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇద్దరు మైనర్ అబ్బాయిలు ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత, సెలవుల రోజుల్లో ఇద్దరు అబ్బాయిలు వారి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఇంతకాలం ఎంతో చక్కగా ఆడుకుంటున్న అబ్బాయిల్లో ఓ అబ్బాయిని మరో అబ్బాయి హత్య చెయ్యడం కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ సమీపంలో 16 ఏళ్ల అబ్బాయి నివాసం ఉంటున్నాడు, ఈ అబ్బాయి నివాసం ఉంటున్న ఏరియాలోనే 13 ఏళ్ల అబ్బాయి నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో చిన్నప్పటి నుంచి ఇద్దరికి పరిచయం ఉంది, మైనర్ అబ్బాయిలు నిత్యం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు.

Friends: 16 year old boy murdered 13 year old boy in Delhi- Meerut expressway at Massuri in Uttar Pradesh

అబ్బాయిలు నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోనే మీరట్- ఢిల్లీ ఎక్స్ ప్రెస్ హైవే రహదారి ఉంది. మనం హైవే రోడ్డు మీదకు వెళ్లి కొత్త కార్లు చూసి వద్దామని 16 ఏళ్ల అబ్బాయి 13 ఏళ్ల అబ్బాయికి చెప్పాడు. ఇద్దరూ కలిసి మీరట్-ఢిల్లీ హైవే ఎక్స్ ప్రెస్ రోడ్డు దగ్గరకు వెళ్లారు. కొంతసేపు హైవే రోడ్డు మీద వెలుతున్న కార్లు చూశారు. తరువాత ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో 16 ఏళ్ల అబ్బాయి కత్తి తీసుకుని అతని వెంట వెళ్లిన 13 ఏళ్ల అబ్బాయి గొంతు చీల్చి దారుణంగా హత్య చేశాడు.

13 ఏళ్ల బాలుడి శవాన్ని సమీపంలోని పొదల్లోకి లాక్కొని వెళ్లి అక్కడ శవం విసిరేసి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే హత్య చేసిన 16 ఏళ్ల అబ్బాయి పోలీసులకు చిక్కిపోయాడు. హర్రర్ సినిమాలు, క్రైమ్ ఎక్కువగా ఉన్న సినిమాలు చూసి హత్య చేస్తే ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి తానే 13 ఏళ్ల స్నేహితుడిని హత్య చేశానని 16 ఏళ్ల అబ్బాయి నేరం అంగీకరించాడని ఎస్సీ ఇరాజ్ రాజ్ స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+