Friends: ఆటో కింగ్ ను చంపిన అన్నదమ్ములు, అక్క కోసం అని బ్రదర్స్ ? కాదు లేడీ కోసం !

బెంగళూరు/ హుబ్బళి: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకులు చాలాకాలంగా ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. లిక్కర్ పార్టీలు చేసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చెయ్యాలన్నా అందరూ కలిసే వెలుతున్నారు. ఈ ఫ్రెండ్స్ లో సొంత అన్నదమ్ములు ఉన్నారు. అయితే ఆటో కింగ్ అని పేరు తెచ్చుకున్న యువకుడు సోదరుల చేతిలో దారుణ హత్యకు గురైనాడు. అయితే పోలీసులు మాత్రం అక్రమ సంబంధం విషయంలో హత్య జరిగిందని అంటున్నారు.

కర్ణాటకలోని హుబ్బళి నగరంలో ధారవాడ కాలనీలో చంద్రశేఖర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుతున్న చంద్రశేఖర్ ఆటో కింగ్ అని పేరు తెచ్చుకున్నాడు. చంద్రశేఖర్ ను పేరుతో పిలవడం మానేసిన అతని స్నేహితులు ఆటో కింగ్ అనే పిలుస్తున్నారు. ఆటో కింగ్ గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ రౌడీలాగా వ్యవహరించేవాడని తెలిసింది.

Friends: Auto king Chandrashekhar murder in Hubbali city in Karnataka.

ధారవాడ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ మరికొంత మంది యువకులు స్నేహితులు అయ్యారు. లిక్కర్ పార్టీలు చేసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చెయ్యాలన్నా చంద్రశేఖర్, అతని ఫ్రెండ్సూ అందరూ కలిసే వెలుతున్నారు. ఈ ఫ్రెండ్స్ లో సొంత అన్నదమ్ములు కిరణ్ భజంత్రీ, అభిషేక్ భజంత్రీ అనే ఇద్దరు యువకులు ఉన్నారు.

కిరణ్ భజంత్రి, అభిషేక్ భజంత్రి కలిసి ఆటో కింగ్ చంద్రశేఖర్ ను కత్తులతో పొడిచి చంపేశారు. మా సోదరిని చంద్రశేఖర్ టార్చర్ పెడుతున్నాడని, అందుకే అతన్ని చంపేశామని కిరణ్ భజంత్రీ, అభిషేక్ భజంత్రీ అంటున్నారు. అయితే అక్రమ సంబంధం విషయంలో, ఆమె ఫోటోలు షేర్ చేసే విషయంలో గొడవ జరగడం వలనే చంద్రశేఖర్ హత్యకు గురైనాడని, ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని హుబ్బళి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+