Friends: బిగ్ షాట్స్ కావాలని అనుకున్న ఫ్రెండ్స్, టైమ్ బ్యాడ్ తో అక్కడికి చేరారు, యూట్యూబ్ స్కెచ్ !
బెంగళూరు: చిన్నప్పటి నుంచి కలిసిమెలసి చదువుకుంటూ తిరిగిన స్నేహితులు జీవితంలో సెటిల్ కావాలని అనుకున్నారు. మంచి వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించాలని ఆలోచించారు. ముగ్గురు స్నేహితులు కలిసి వ్యాపారం చెయ్యాలని అనుకున్నారు. హోటల్ రంగంలో అయితే మంచి లాభాలు ఉంటాయని ఆలోచించారు. ముగ్గురు స్నేహితులు కలిసి మూడు సంవత్సాల ముందు హోటల్ పెట్టారు. హోటల్ వ్యాపారం బాగా జరగడంతో ఇంకా కొంచెం అప్పు చేసి హోటల్ ను కొంచెం విస్తరించారు. అక్కడ వీరి ప్లాన్ రివర్స్ అయ్యింది.
పెద్దగా హోటల్ పెట్టిన తరువాత కరోనా వైరస్ దెబ్బతో హోటల్ మూతపడటంతో అప్పుల్లో కూరుకుపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతం అయ్యారు. అంతే హోటల్ సమీపంలో ఉన్న ఓ జ్యూవెలరీ షాపుకు కన్నం వెయ్యాలని డిసైడ్ అయ్యారు. సౌండ్ రాకుండా తాళం పగలగొట్టే మిషన్ ను యూట్యూబ్ సహాయంతో కొనుగోలు చేశారు. అనుకున్నట్లు సౌండ్ రాకుండా జ్యువెలరీ షాపులో బంగారు నగలు లూటీ చేశారు. చోరీకి సంబంధించి చిన్నక్లూ కూడా పోలీసులకు చిక్కలేదు. అయితే ఓ కారు నెంబర్ ఆధారంగా ఫ్రెండ్స్ పోలీసులకు చిక్కిపోయారు.

చిన్ననాటి స్నేహితులు
బెంగళూరులోని ఇందిరానగర్ సమీపంలో శ్యామ్, మహేంద్ర, నీలకంఠ అనే ముగ్గురు నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలసి చదువుకుంటూ తిరిగిన స్నేహితులు శ్యామ్, మహేంద్ర, నీలకంఠ జీవితంలో సెటిల్ కావాలని అనుకున్నారు. మంచి వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించాలని శ్యామ్, మహేంద్ర, నీలకంఠ ఆలోచించారు.

హోటల్ రంగం బాగుంటుందని ప్లాన్
హోటల్ రంగంలో అయితే మంచి లాభాలు ఉంటాయని శ్యామ్, మహేంద్ర, నీలకంఠ ఆలోచించారు. ఇదే విషయాన్ని ఆముగ్గురు స్నేహితులు వారికి తెలిసినవాళ్లను అడిగి చర్చించారు. ముగ్గురు స్నేహితులు కలిసి మూడు సంవత్సాల ముందు హోటల్ పెట్టారు. హోటల్ వ్యాపారం బాగా జరగడంతో శ్యామ్, మహేంద్ర, నీలకంఠ వారికి తెలిసివాళ్ల దగ్గర ఇంకా కొంచెం అప్పు చేసి హోటల్ ను కొంచెం విస్తరించారు.

కరోనా దెబ్బతో ఢమాల్
కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ మొదలు కాకముందే వీరి ప్లాన్ రివర్స్ అయ్యింది. పెద్దగా హోటల్ పెట్టిన తరువాత కరోనా వైరస్ దెబ్బతో హోటల్ మూతపడటంతో ముగ్గురు స్నేహితులు అప్పుల్లో కూరుకుపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక నీలకంఠ, శ్యామ్, మహేంద్ర సతమతం అయ్యి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జ్యువెలరీ షాప్ లో చోరీకి సూపర్ స్కెచ్
అంతే ఇందిరానగర్ లోని మీనా జ్యూవెలరీ షాపుకు కన్నం వెయ్యాలని ముగ్గురు స్నేహితులు డిసైడ్ అయ్యారు. కొన్ని రోజుల నుంచి మీనా జ్యువెలరీ షాపు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఓ స్కెచ్ వేశారు. సౌండ్ రాకుండా తాళం పగలగొట్టే మిషన్ కోసం యూట్యూబ్ సహాయంతో సెర్చ్ చేసి చివరికి ఆ మిషన్ కొనుగోలు చేశారు. అనుకున్నట్లు సౌండ్ రాకుండా మీనా జ్యువెలరీ షాపులో 1 కేజీ 250 గ్రాముల బంగారు నగలు లూటీ చేశారు.

గోవా నుంచి రివర్స్
మరుసటి రోజు మీనా జ్యువెలరీస్ లో చోరీ అయిన విషయం వెలుగు చూసింది. చోరీకి సంబంధించి చిన్నక్లూ కూడా పోలీసులకు చిక్కలేదు. అయితే మీనా జ్యువెలరీ షాపు సమీపంలో ఏర్పాటు చేసిన ఓ కారు నెంబర్ ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. కారు నెంబర్ యజమాని నీలకంఠ మొబైల్ ఫోన్ ట్రేస్ చేశారు. బంగారు నగలు చోరీ చేసిన ముగ్గురు స్నేహితులు నగలతో సహ గోవాకు బయలుదేరారు.
Recommended Video

బెంగళూరు రాకముందే ప్లాన్ రివర్స్
కర్ణాటక- గోవా బార్డర్ లో కోవిడ్ 19 రూల్స్ పాటిస్తూ వాహనాలను పోలీసులు పరిశీలిస్తున్న విషయం గుర్తించిన స్నేహితులు భయపడ్డారు. కారు చెక్ చేస్తే అందులోని బంగారు నగలు బయటపడితే చిక్కిపోతామని అనుకున్నారు. గోవా బార్డర్ నుంచి బెంగళూరు బయలుదేరిన నీలకంఠ, మహేంద్ర, శ్యామ్ బంగారు నగలు అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేయాలని అనుకున్నారు, అయితే బెంగళూరు రాకముందే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ వ్యాపారం చేసి జీవితంలో సెటిల్ అయిపోవాలని అనుకున్న ముగ్గురు స్నేహితులు ఇప్పుడు కటకటాలపాలైనారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications