Friends: బర్త్ డే పార్టీ, బర్త్ డే బాయ్ ని కొట్టి చంపేసిన ఫ్రెండ్స్, మద్యం మత్తులో కేక్ కట్ చేసి !

చెన్నై: స్నేహితులు ప్రతిరోజు కలుసుకుంటూ టీలు, సిగరెట్లు తాగుతూ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పగటిపూట ఎవరిపనులు వాళ్లు చేసుకుంటూ రాత్రి కలుస్తున్నారు. ఇదే సందర్బంలో ఓ యువకుడి పుట్టిన రోజు వచ్చింది. బర్త్ డే సందర్బంగా ఆ యువకుడి స్నేహితులు అందరూ కలిసి లిక్కర్ పార్టీ చేసుకున్నారు. అదే స్నేహితుల చేతిలో బర్త్ డే జరుపుకుంటున్న యువకుడు హత్యకు గురి కావడం కలకలం రేపింది.

చెన్నై సిటీ సమీపంలోని అలమడి క్రిష్ణానగర్ లో మారి (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన మారి ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. మారీ స్నేహితులు కొందరు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మారీ స్నేహితుల్లో లోకేశ్వరన్, రామమూర్తి తదితరులు ఉన్నారు.

 Friends: Tragedy at the birthday party celebration that ended in murder near Chennai.

మారీ స్నేహితులు ప్రతిరోజు కలుసుకుంటూ సిగరెట్లు తాగుతూ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పగటిపూట ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ రాత్రి కలుస్తున్నారు. ఇదే సందర్బంలో మారీ పుట్టిన రోజు వచ్చింది. బర్త్ డే సందర్బంగా మారీ అతని స్నేహితులు అందరూ కలిసి లిక్కర్ పార్టీ చేసుకున్నారు.

ఆ సందర్బంలో స్నేహితులు భారీ కేక్ తెప్పించి మారీ దగ్గర కట్ చేయించారు. ఆ సమయంలో కేట్ కు ఉన్న క్రీమ్ మారీ ముఖానికి పూస్తూ ఎంజాయ్ చేశారు. ఆ సందర్బంలో లోకేశ్వరన్, రామమూర్తి కలిసి బర్త్ డే బాయ్ మారీ తల మీద దాడి చెయ్యడంతో అతను కుప్పకూలిపోయాడు, తలకు తీవ్రగాయాలైన మారీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మారీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బర్త్ డే రోజే మారీ స్నేహితుల చేతిలో హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+