Driving Licence: ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్..!
సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏం చేస్తాం. ఆర్టీఓ వెబ్ సైట్ కు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుంటాం. తర్వాత స్లాట్ బుక్ అయిన రోజున ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్తాం. అక్కడ డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొంటాం. మనం డ్రైవింగ్ బాగా చేస్తే మనకు లైసెన్స్ ఇస్తారు. లేకుంటే నేర్చుకుని మళ్లీ రావాలని చెబుతారు. సో లైసెన్స్ రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సమయం కూడా పడుతుంది. అయితే జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.
అవును ఇది నిజమే కేంద్రం కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పు తీసుకొచ్చింది. కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీవో ఆఫీస్ ల్లో కాకుండా ఎక్కడ తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు.. ఆగండి అక్కడే వస్తున్నా.. ఆర్టీఓ కార్యాలయాల్లో బదులుగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల్లో సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది.

ఇందుకు సంబంధించి డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే శిక్షణా కేంద్రానికి లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారం ఇస్తారు. సర్టిఫికేట్ జారీ చేయడానికి అధికారం రావాలంటే.. డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు కనీసం 1ఎకరా విస్తీర్ణంలో ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు శిక్షణ కేంద్రాల వద్ద సరైన సదుపాయాలు ఉండాలి.
ట్రైనర్స్ హైస్కూల్ డిప్లమా లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వారికి కనీసం 5ఏళ్ళ డ్రైవింగ్ శిక్షణ అనుభవం ఉండాలి.అంతే కాకుండా ట్రైనర్స్ కి బయోమెట్రిక్ వంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల అవగాహన ఉండాలి. డ్రైవింగ్ శిక్షణా కాలం 4వారాలుగా ఉండాలి. ఇందులో 8గంటలు థీరియాటికల్ శిక్షణ, 21గంటలు ప్రాక్టికల్ శిక్షణ ఉండాలి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications