మురికివాడ యువరాణి.. అదృష్టం అంటే ఈమెదే!
నరకప్రాయమైన మురికివాడ.. విద్యుత్ లేని చిన్నపాటి గుడిసె.. తాగడానికి నీళ్లు లేక మైళ్ల దూరం నడక.. కానీ, ఆ కళ్లలో మాత్రం ప్రపంచాన్ని ఏలాలనే కోటి కాంతుల కల! ఆ కల పేరు మలీషా ఖర్వా(Maleesha Kharwa). కేవలం 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఈ 'మురికివాడ యువరాణి' కథ, ఏదో హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ కాదు.. అక్షరాలా నిజమైన ఒక అద్భుత గాథ!
ముంబైలోని మురికివాడల్లో ఒక చిన్న 'కచ్చా ఝోంప్రి'లో మలీషా నివసించేది. మురుగు కాలువలు, చెత్త కుప్పల మధ్య ఉన్న ఆ ఇరుకైన సందులే ఆమె ప్రపంచం. మున్సిపల్ అధికారులు ఎప్పుడు వచ్చి ఇల్లు కూల్చేస్తారో తెలియని భయం మధ్య ఆమె బాల్యం గడిచింది. అయితే, ఆరేళ్ల ప్రాయం నుంచే మాలీషా ఒక వింత ప్రపంచంలో విహరించేది. ప్రతి రాత్రి కళ్లు మూసుకుని, తాను ఒక సూపర్ మోడల్‌గా పేరున్న డిజైనర్ల దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తున్నట్లు ఊహించుకునేది. ఆ ఊహలే ఆమెను ఈరోజు నిజమైన 'క్వీన్'గా నిలబెట్టాయి.

ఒక్క వీడియోతో మారిన Maleesha Kharwa తలరాత..
కోవిడ్ లాక్డౌన్ సమయంలో ముంబైలో చిక్కుకున్న హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మన్ రూపంలో మలీషాకు ఒక దైవదూత పరిచయమయ్యాడు. మురికివాసులతో మ్యూజిక్ వీడియో చేస్తున్న హాఫ్‌మన్‌కు మలీషా ఉత్సాహం, ఆ ఫోటోజెనిక్ ముఖం బాగా నచ్చాయి. ఆమె కలలను విన్న హాఫ్‌మన్, ఆమె కోసం ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి 'GoFundMe' ద్వారా సాయం కోరాడు. మలీషా తన పేదరికాన్ని చూపిస్తూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. అప్పటివరకు కేవలం తన గుడిసెకే పరిమితమైన ఆమె ప్రతిభ ప్రపంచానికి పరిచయమైంది.
భారతదేశపు అగ్రశ్రేణి బ్రాండ్‌కు అంబాసిడర్‌గా Maleesha Kharwa!
అదృష్టం ఒక్కసారి తలుపు తడితే ఆకాశమే హద్దు అని మలీషా నిరూపించింది. ఏప్రిల్ 2023లో ప్రముఖ బ్యూటీ బ్రాండ్ 'ఫారెస్ట్ ఎసెన్షియల్స్' తన 'యువతి' కలెక్షన్‌కు మాలీషాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఒక మురికివాడ నుంచి వచ్చిన అమ్మాయి ఒక లగ్జరీ బ్రాండ్‌కు కవర్ పేజ్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విజయంతో మాలీషా జీవితం పూర్తిగా మారిపోయింది. "ఇప్పుడు నా తండ్రి భోజనం మానేయాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పిన మాటలు వింటుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.
లక్ష్యాల దిశగా.. లక్షలాది మందికి స్ఫూర్తిగా!
ప్రస్తుతం వోగ్ (Vogue), కాస్మోపాలిటన్ వంటి టాప్ మ్యాగజైన్ల కవర్లపై మలీషా మెరుస్తోంది. కైలీ జెన్నర్, సాయి పల్లవిల ఆత్మవిశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకునే మలీషా.. తన తండ్రికి ఒక పెద్ద ఇల్లు కొనివ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కేవలం తన గురించే కాకుండా, తనలాంటి నేపథ్యం ఉన్న పిల్లల కలలను నెరవేర్చడానికి 'మలీషా పీపుల్' (Maleesha People) అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. మురికివాడలో ఉన్నా సరే.. కలలు కనే ధైర్యం ఉంటే, వాటిని నిజం చేసే మార్గం కనిపిస్తుందని మాలీషా ఖర్వా నిరూపించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications