జాక్ పాట్ కొట్టిన కూలీ.. రూ. 6తో కోటీశ్వరుడు అయ్యాడుగా..!
దరిద్రం ప్రతి సారీ తలుపు తడుతుంది.. కానీ అదృష్టం మాత్రం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది అన్న నానుడి నిజం అయింది. ఆ కూలీకి అదృష్టం నిజంగానే గుమ్మం ముందుకు వచ్చి తలుపు తట్టింది. రాత్రికి రాత్రే అతడ్ని కోటీశ్వరుడిని చేసింది. ఆనందం పట్టలేక ఆ కూలీ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది.
పంజాబ్ లోని మోగా జిల్లాకు చెందిన జస్మాయిల్ సింగ్ ఓ దినసరి కూలీ. అతనికి భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఓ పిల్లాడు బధిరుడు. రోజూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి జస్మాయిల్ సింగ్ ది. అతడిని ఒక్కసారిగా అదృష్టం వరించింది. రూ. 6 పెట్టి ఫిరోజ్ పుర్ లోటికెట్ కొనుగోలు చేసిన జస్మాయిల్ సింగ్.. కొన్ని గంటల తర్వాత ఊహించని ఫలితం అందుకున్నాడు.

లాటరీ గెలుచుకున్నట్లు నిర్వాహకులు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. రూ. కోటి గెలుచుకున్నట్లు తెలిపారు. దీంతో జస్మాయిల్ సింగ్.. ఇది ఏదో ప్రాంక్ అని మొదట నమ్మలేదు. కానీ లాటరీ స్టాల్ ఓనర్ గుల్షాన్ శర్మ ఈ విషయాన్ని చెప్పడంతో ఎగిరి గెంతేశాడు. తాను ఇది నమ్మలేక పోతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆయన కుటుంబం సంబరాలు చేసుకుంటోంది.
पंजाब: मोगा निवासी की ₹6 की लॉटरी ने बदली किस्मत, जीते 1 करोड़ रुपये
— AajTak (@aajtak) July 16, 2025
पंजाब के फिरोजपुर जिले में मोगा के रहने वाले जसमेल सिंह की किस्मत ने बड़ा पलटा खाया। मजदूरी करने वाले जसमेल ने महज 6 रुपये की लॉटरी जीरा में खरीदी और कुछ घंटों बाद ही लॉटरी एजेंट का फोन आया कि उनकी 1 करोड़… pic.twitter.com/8uCmtjgaL9
ఆ తర్వాత జస్మాయిల్ సింగ్ మాట్లాడుతూ.. తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. తన కుటుంబం పేదరికంలో మగ్గిపోయిందని తెలిపాడు. ఇద్దరు పిల్లలు స్కూల్ కు వెళుతున్నారు. ఒకరు బధిరుడు అని తెలిపాడు. బతకడం కష్టంగా మారిన తరుణంలో దేవుడు తమకు దారి చూపించాడని చెప్పుకొచ్చాడు జస్మాయిల్ సింగ్.
తనకు 30 లక్షల అప్పు ఉందని ఆ అప్పు తీర్చి.. మిగతా డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చుపెడతానని జస్మాయిల్ సింగ్ తెలిపాడు. మరోవైపు జస్మాయిల్ భార్య విర్పాల్ కౌర్ కూడా ఆనందం వ్యక్తంచేసింది. ఇలాంటి రోజును తాను ఊహించలేదని తెలిపింది. ఇప్పుడు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామని పేర్కొంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications