శుభవార్త: దీపావళికి పెట్రోల్ ధరల తగ్గుదల: ధర్మేంధ్రప్రధాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమృత్‌సర్: వచ్చే నెలలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ ప్రకటించారు.

కొంతకాలంగా పెట్రోలియం ఉత్పత్తుల దరలు విపరీతంగా పెరగడంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సోమవారం నాడు చేసిన ప్రకటన వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది.

Fuel prices may come down by Diwali, says Dharmendra Pradhan

అమృత్‌సర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ధర్మేంద్రప్రధాన్ మీడియాతో మాట్లాడారు. అమెరికాలో వరదల కారణంగా సుమారు 13 శాతం చమురు ఉత్పత్తి తగ్గిపోయిందని కేంద్ర మంత్రి ప్రకటించారు.

పెట్రోలియం ధరల పెరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం, పరిష్కారం ఒక్కటే.. పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడమే' అని మంత్రి ధర్మేంధ్రప్రధాన్ అభిప్రాయపడ్డారు..

ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను, జీఎస్‌టీ కౌన్సిల్‌ను తాము కోరుతున్నామని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రంలో ఎక్సైజ్‌ పన్ను, రాష్ట్రాల్లో వ్యాట్‌ పడుతుందని, అందుకే ఏకీకృత పన్ను విధానంలో భాగంగా దీన్ని జీఎస్టీ కిందకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Petroleum and natural gas minister Dharmendra Pradhan said on Monday that fuel prices may come down by Diwali, which is next month.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X