గగన్‌యాన్ వ్యోమగామి నా భర్తే: తన పెళ్లి సీక్రెట్ రివీల్ చేసిన ప్రముఖ సినీనటి!!
గగన్ యాన్ మిషన్.. భారత అంతరిక్ష పరిశోధనారంగంలో మానవ అంతరిక్షయాత్ర కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాములు. ఇక తాజాగా వీరి పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గగన్ యాన్ యాత్ర కోసం ఎంపికైన వ్యోమగాములలో గ్రూప్ కెప్టెన్ గా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఈ సందర్భంగా నలుగురు వ్యోమగాములను భారత ప్రధాని అభినందించారు. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయం దేశ యువతలో శాస్త్రీయ స్వభావానికి బీజం వేస్తుందని భారత ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక గగన్ యాన్ కి వ్యోమగామి కి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

మలయాళీనటి లీనా తాను భారత తొలి మానవరహిత అంతరిక్ష ప్రయోగంలో పాలుపంచుకుంటున్న గగన్ యాన్ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. నిన్న ప్రధాని ప్రకటన అనంతరం ఈ విషయాన్ని నటి లీనా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ జంట జనవరి 17వ తేదీన వివాహం చేసుకోగా, నటి లీనా ఫిబ్రవరి 27వ తేదీన ప్రధాని ప్రకటన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించింది.
ఫిబ్రవరి 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత వైమానిక దళ ఫైటర్ పైలెట్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కు మొదటి భారత వ్యోమగామిగా ఆస్ట్రోనాట్ వింగ్ ను ప్రదానం చేయడం మన దేశానికి, కేరళకి, ముఖ్యంగా నాకు గర్వకారణం అంటూ నటి లీనా పోస్టులో పేర్కొంది.
జనవరి నెలలోనే తమ పెళ్లి జరిగినప్పటికీ ఇంతకాలం సీక్రెట్ గా ఉంచిన నటి లీనా తన భర్త ఎవరు అన్నది తాజాగా ప్రకటించడం, అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత ఆసక్తికరంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి లీనా అనేక సినిమాలలో నటించారు. దాదాపు 100కు పైగా మలయాళ చిత్రాలను నటించిన ఆమె తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications