బర్త్ డే ఎఫెక్ట్: నా జీవితం ప్రజా సేవకు అంకితం, ఆశీర్వదించండి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన పుట్టిన రోజు (జనవరి 11) సందర్బంగా కొత్త జీవితం ప్రారంభిస్తానని ప్రకటించారు. 2019 నూతన సంవత్సరం సందర్బంగా తన జీవితం ప్రజా సేవకు అంకితం చేస్తానని, మీరు నన్ను అశీర్వదించాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రజలకు మనవి చేశారు.
పుట్టిన రోజు సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు, ప్రజలకు తన కార్యకలాపాల గురించి ఈ విదంగా వివరించారు. జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొవాలని దాసరు ( మత గురువు) చెప్పారని గుర్తు చేశారు.

గాలి @ 52
తాను కష్టాల్లో ఉన్న సమయంలో మీరు తనకు అండగా ఉన్నారని, మీ అండదండలు ఇలాగే కొనసాగుతాయని ధైర్యంతో నేను 52వ సంవత్సరంలో అడుగు పెడుతున్నానని అన్నారు. 2004 జనవరి 31వ తేదీ తన తల్లి మరణించారని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు.

ప్రత్యేక పూజలు
2004 సంవత్సరం నుంచి నూతన సంవత్సరం వేడుకలు, పుట్టిన రోజు వేడుకలకు తాను దూరంగా ఉంటున్నానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. తన పుట్టిన రోజు సందర్బంగా తన అభిమానులు, ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

ప్రజల ఆశీర్వాదం
తన పుట్టిన రోజు సందర్బంగా ఈ సంవత్సరం ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదని, దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టిన రోజు జరుపుకుంటానని, మీ ఆశీర్వాదం తనకు ఎప్పుడూ ఉండాలని గాలి జనార్దన్ రెడ్డి మనవి చేశారు.

ప్రత్యక్ష రాజకీయాలు
2019 నూతన సంవత్సరం సందర్బంగా తాను కొత్త జీవితంలో అడుగు పెడుతానని, ప్రజా సేవ కొనసాగిస్తానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. కొన్ని సంవత్సరాల నుంచి గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

మానసికంగా సిద్దం అయ్యాను
కొత్త సంవత్సరం సందర్బంగా నిరంతరం ప్రజా సేవ చెయ్యడానికి తాను మానసికంగా సిద్దం అయ్యానని, అందుకు మీరు అశీర్వదించాలని గాలి జనార్దన్ రెడ్డి మనవి చేశారు. తన జీవితంలో 2019లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఈ సంవత్సరం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతానని పరోక్షంగా ఆయన అభిమానులు, అనుచరులకు సూచించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications