బెంగాల్‌లో ఫైర్ యాక్సిడెంట్, రంగంలోకి దిగిన 6 ఫైరింజన్లు
పశ్చిమ బెంగాల్ సిలిగురి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. వార్డ్ నంబర్ 18వ వద్ద ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి.. సమీపంలో గల ఇళ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం తెలిసిన వెంటనే ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు.

ప్రమాదం జరిగిన చోటు చాలా ఇరుకుగా ఉంది. దీంతో మంటలను ఆర్పివేయడం అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందిగా మారుతుంది. కడపటి వార్త అందేవరకు ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరాలేదు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుంది. పక్క పక్కనే గల ఇళ్లు ఉండటం.. మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతి అయి ఉంటుంది. ఎంత మొత్తంలో నష్టం వాటిల్లిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఇదిలా ఉంటే మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications