హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ భార్య నామినేషన్, పార్టీ నాయకులు, లెక్కలేనంత మంది ఫ్యాన్స్ !
లోక్ సభ ఎన్నికల ప్రచారం మంచి ఊపుమీద ఉంది. ముఖ్యంగా కర్ణాటకలో లోక్ సభ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అధికారంలో దక్కించుకున్న బీజేపీ తరువాత అధికారాన్ని చేతులారా వదులుకుంది. ప్రయోగాలు చెయ్యడానికి ప్రయత్నించిన బీజేపీ హైకమాండ్ దక్షిణ భారతదేశంలో అధికారంలో ఉన్న కర్ణాటకలో అధికారానికి దూరం అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు మరోసారి చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న బీజేపీ హైకమాండ్ కర్ణాటకలో మరోసారి సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నది. గత లోక్ సభ ఉన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లను నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి ఎలా వచ్చామో ఇప్పడు అలాగే లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటుకుని ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక కర్ణాటకలో హాట్ టాపిక్ అయిన శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీవై రాఘవేంద్రపై కాంగ్రెస్ నుంచి గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. శ్యాండిల్ వుడ్ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ సోమవారం ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
హీరో శివరాజ్ కుమార్ భార్యకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు శివరాజ్ కుమార్ అభిమానులు భారీ సంఖ్యలో మద్దతు ఇచ్చారు. ర్యాలీగా శివమొగ్గ ఎన్నికల అధికారుల కార్యాలయానికి వెళ్లిన గీతా శివరాజ్ కుమార్ ఆమె నామినేషన్ దాఖలు చేశారు. గీతా శివరాజ్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్బంగా శివమొగ్గ జిల్లాలోని శివరాజ్ కుమార్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున్న శివమొగ్గ నగరానికి చేరుకున్నారు.
శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గీతా శివరాజ్ కుమార్ నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు ఎంతో ప్రసిద్ది చెందిన సిగందూరు చౌడేశ్వరి ఆలయాన్ని సందర్శించి బి ఫారమ్ గుడిలో పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాగోడు తిమ్మప్పను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్న తరువాతగీతా శివరాజ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేఎస్ ఈశ్వరప్ప ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications