సమ్మెకు సిద్దమైన Zepto, Blinkit, Flipkart గిగ్ వర్కర్స్..!
మారుతున్న కాలానుగుణంగా ప్రజల జీవన శైలిలో సైతం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా కావాలంటే బయటికి వెళ్లి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే అన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసే పరిస్థితి ఉంది. కూరగాయలు నుంచి ఇంట్లో సరుకులు, బట్టలు, గృహోపకరణాలు ఇలా ఒక్కటి కాదు అన్నీ ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. కొన్ని డెలివరీ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు 8 నుంచి 10 నిమిషాల్లోనే డెలివరీ చేయడం టార్గెట్ గా పెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ క్విక్ ఈ-కామర్స్ అండ్ ఫుడ్ డెలివరీ కంపెనీల డెలివరీ బాయ్స్ భారీ సమ్మెకు పిలుపునిచ్చారు.
కాగా గిగ్ వర్కర్స్ సమ్మెకు పిలుపునివ్వడం తీవ్ర చర్చకు తెర లేపుతోంది. గిగ్ వర్కర్స్ అంటే శాశ్వత ఉద్యోగం కాకుండా కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్స్ విధానంలో పనిచేసే కార్మికులు. వీరంతా క్విక్ డెలివరీ విధానం సహా పలు విధానాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ జీతాలు, భద్రత లేని పని పరిస్థితులు, అధిక పని గంటలతో పాటు పలు అంశాలపై నిరసన తెలుపుతున్నారు. అందుకు గాను ఇప్పటికే డిసెంబర్ 25న కూడా గిగ్ వర్కర్స్ సమ్మె చేశారు. ఇప్పుడు మళ్లీ డిసెంబర్ 31ను సమ్మె బాట పట్టనున్నారు.

అయితే భారత దేశ వ్యాప్తంగా ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో జరుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పార్టీలు, సెలబ్రేషన్ల కోసం ఆహారం, కిరాణా, పానీయాలు భారీగా ఆర్డర్ అవుతాయి. ఈ తరుణంలో డెలివరీ బాయ్స్ ఫుల్ బిజీగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఆందోళన చేపట్టడంతో ఆర్డర్స్ కి భారీగా గండిపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమ్మెలో జెప్టో, బ్లింక్ఇట్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల డెలివరీ బాయ్స్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మరి ఆ రోజు ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సేవలపై ఈ ఎఫెక్ట్ పడుతుందా లేదా సంస్థలు ఈ సమస్యలను పరిష్కరిస్తాయా అనేది తెలియాల్సి ఉంది.
డెలివరీ బాయ్స్ ప్రధాన డిమాండ్లు..
కనీస వేతనానికి సమానమైన ఆదాయానికి హామీ
రోజుకు 8 గంటల పని విధానం, అదనపు పనికి ఓవర్‌టైమ్ వేతనం
గంటలు, శ్రమ ఆధారంగా పారదర్శక చెల్లింపు విధానం.
ప్రమాదాలు, అనారోగ్యాలకు బీమా మరియు సామాజిక భద్రత
పొగమంచు సమయాల్లో రాత్రి 11 గంటల తర్వాత డెలివరీలు నిలిపివేయాలి
ఒక్క కస్టమర్ ఫిర్యాదుతో విచారణ లేకుండా ID బ్లాక్ చేయకూడదు.
-
ఇల్లు కట్టే వారికి బంపర్ ఆఫర్: కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే.. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications