Student: 9వ తరగతి అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్, ఎస్కేప్, సీసీటీవీల్లో !

చెన్నై/ తిరువల్లూరు: దంపతులు వారి ఇద్దరు కుమార్తెలను బాగా చదివించాలని అనుకుంటున్నారు. తండ్రి కష్టపడి కూతుర్ల చదువు కోసం డబ్బులు కూడా దాచిపెడుతున్నాడు. దంపతుల పెద్ద కుమార్తె 9వ తరగతి చదువుతోంది. కొన్ని రోజుల నుంచి పెద్ద కూతురు నేను ఆ స్కూల్ కు వెళ్లనని, తనను వేరే స్కూల్లో చేర్పించాలని మొండికి వేసి స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నది. వేరే స్కూల్ మార్చడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇంటి నుంచి అమ్మాయి పారిపోయింది. ఆ సందర్బంలో ఓ యువకుడు 9వ తరగతి అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలు తప్పించుకుని రోడ్డు మీద పరుగు తీసింది.

 దంపతులకు ఇద్దరు కుమార్తెలు

దంపతులకు ఇద్దరు కుమార్తెలు

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలోని అవడి సమీపంలో పట్టాబ్రమ్ ప్రాంతంలో సెల్వరాజ్ (పేరు మార్చం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 13 సంవత్సరాల క్రితం సెల్వరాజ్ వివాహం చేసుకున్నాడు. సెల్వరాజ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలతో కలిసి దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

 స్కూల్ మార్చాలని కూతురు డిమాండ్

స్కూల్ మార్చాలని కూతురు డిమాండ్

సెల్వరాజ్ దంపతులు వారి ఇద్దరు కుమార్తెలను బాగా చదివించాలని అనుకుంటున్నారు. సెల్వరాజ్ కష్టపడి కూతుర్ల చదువు కోసం డబ్బులు కూడా దాచిపెడుతున్నాడు. సెల్వరాజ్ దంపతుల పెద్ద కుమార్తె 9వ తరగతి చదువుతోంది. 10 రోజుల నుంచి పెద్ద కూతురు నేను ఆ స్కూల్ కు వెళ్లనని, తనను వేరే స్కూల్లో చేర్పించాలని మొండికి వేసి స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నది.

 ఇంట్లో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన అమ్మాయి

ఇంట్లో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన అమ్మాయి

వేరే స్కూల్ మార్చడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. గురువారం సాయంత్రం ఆ అమ్మాయి ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో ఫ్యాన్ కు చీర సరిగా కట్టకపోవడంతో చీర తెగిపోవడంతో 9వ తరగతి అమ్మాయి ప్రాణాలతో భయటపడింది.

 అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్

అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్

ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన విషయం ఇంట్లో తెలిస్తే తనను చంపేస్తారని భయపడిన అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది. ఏఐఎఫ్ రోడ్డు మీద వెలుతున్న సమయంలో ఓ యువకుడు 9వ తరగతి అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి మూడు కాలోమీటర్ల దూరంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు.

 సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయిన కామాంధుడు

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయిన కామాంధుడు

బాధితురాలు ఆటో డ్రైవర్ చెరనుంచి తప్పించుకుని రోడ్డు మీద పరుగు తీసింది. బాలిక రోడ్డు మీద పరిగెడుతున్న విషయం గుర్తించిన స్థానిక మహిళ ఆ అమ్మాయిని రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు బాధితురాలు అత్యాచారం విషయం చెప్పింది. ఐఏఎఫ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు పట్టాబ్రమ్ లోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ రామక్రిష్ణ అనే కామాంధుడిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+