నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు
న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు విషయంలో గోవా సూపర్‌డెంట్ ఆప్ పోలీసు(సైబర్ క్రైమ్) కార్తిక్ కశ్యప్ మాట్లాడుతూ "మొత్తం ఎనిమిది మంది పేర్లు మీద నకిలీ ఫేస్ ఐడీలను ఆమె తెరిచింది. ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించి ఈ అకౌంట్లను క్రియేట్ చేయండతో సవాలుగా మారింది" అని అన్నారు.

చిట్టచివరకి ఆమె ఆచూకీని తెలుసుకున్నామని అన్నారు. అంతేకాకుండా ఈ నేరం చేయడానికి ఆమె ఉపయోగించిన పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితురాలికి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అలవాటు.
ఎవరూ తనని ట్రాక్ చేయకుండా ఉదయాన్నే ఈ నకిలీ ప్రొపైళ్లు క్రియేట్ చేయడంతో పాటు వాటిలో అసభ్యకర మేసేజ్‌లను పోస్ట్ చేసేదని, ఐతే ఇలా ఎందుకు చేస్తుందో వివరాలు తెలియాల్సి ఉందని కశ్యప్ చెప్పారు.












Click it and Unblock the Notifications