viral video:సూపర్: రెండు చేతులతో బోర్డుపై రాసి, యువతి అద్భుత ప్రతిభ..వైరల్
ఓకేసారి రెండు చేతులతో రాయం అరుదు.. అదీ కూడా రెండు భాషల్లో అంటే సదరు వ్యక్తి ఏకసంతగ్రహి అయి ఉంటారు. త్రి ఇడియట్స్ మూవీలో వైరస్ ఇలానే రెండు చేతులతో రాస్తారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లోకి వస్తే ఓ యువతి అలానే బ్లాక్‌బోర్డుపై రాసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రెండు చేతలుతో రాస్తోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

నిమిషంలో 45 పదాలు రాసి..
మంగళూరుకు చెందిన ఆది స్వరూప గురించి మనం ఇంతవరకు చెప్పుకుంది. ఈమె ఇదివరకు కూడా ఒక రికార్డ్ సాధించారు. ఇదివరకు నిమిషంలో 45 పదాలను రాశారు. లతా ఫౌండేషన్ ప్రత్యేక ప్రపంచ రికార్డు సాధించారు. ఇప్పుడు మరో వీడియోలో అలవోకగా కన్నడలో, ఇంగ్లీషులో రాశారు. రెండు చేతులతో అలా రాసుకుంటూ పోయారు. ఎక్కడ తడబాటు లేదు. కన్నడ అంటే మాతృభాష ఓకే.. ఇంగ్లీషులో కూడా అదేవిధంగా రాశారు. స్ట్రెయిట్‌గా రాసి ఆమె ఊరుకోలేదు. రివర్స్‌లో కూడా తాను రాసింది.
రివర్స్, అటు నుంచి ఇటు కూడా..
మధ్యలో నుంచి అటు, ఇటుగా కూడా రాశారు. చూడటానికే ముచ్చటగా అనిపించింది. ఆమె మాత్రం తాను రాసుకుంటూ వెళ్లిపోయారు. 2 నిమిషాల వీడియోను అంతా కళ్లర్పకుండా చూశారు. రాయడం ఆమె ప్రాక్టీస్ చేశారు. అలా బ్లాక్‌బోర్డుపై రాసింది. వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్ల కామెంట్లతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ఈమె నిజం వైరస్ అంటూ కొనియాడుతున్నారు. చాలా వేగంగా అలా ఎలా రాస్తుందబ్బా అని అంటున్నారు. ఈమె నిజంగా సూపర్ అంటూ తెగ కామెంట్స్ పడుతున్నాయి.

గాడ్స్ గిఫ్ట్
ప్రపంచంలో ఇలా ఎవరూ రాసి ఉండరు అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇదీ ఆమెకు లభించిన బహుమతి అని మరొకరు అన్నారు. ఆమె రియల్ డీన్ వీరు అని రాశారు. అవును నిజమే.. ఆమె అత్యంత వేగంతో రాయడం కట్టిపడేసింది. ప్రతీ ఒక్కరూ వావ్ అని కామెంట్ చేస్తున్నారు. ఆ భగవంతుడి కృప సదరు యువతికి దక్కిందని మరొకరు అన్నారు.












Click it and Unblock the Notifications