Girlfriend: కంపెనీలోకి వెళ్లి మాజీ గర్ల్ ఫ్రెండ్ ముఖం చెక్కేశాడు, ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి !
చెన్నై/కోయంబత్తూరు: డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. కాలేజ్ చదువు పూర్తి కావడంతో ప్రముఖ కార్ల కంపెనీ షోరూమ్ లో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తున్న యువతికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. తరువాత ఇద్దరు నేరుగా కలుసుకుంటున్నారు. ఇటీవల తేడా రావడంతో యువతి అతనితో మాట్లాడకుండా దూరం పెట్టింది. యువకుడి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. సాయంత్రం నేరుగా కారు షోరూమ్ దగ్గరకు వెళ్లిన యువకుడు ఆ యువతితో గొడవ పెట్టుకున్నాడు. తరువాత జోబులో ఉన్న కత్తి తీసుకుని యువతి ముఖం, మెడ, ఛాతీ మీద ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

సోషల్ మీడియాలో టైమ్ పాస్
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని కునియాముత్తూరు ప్రాంతంలో 21 ఏళ్ల రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. డిగ్రీ పూర్తి చేసిన రజని సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. కాలేజ్ చదువు పూర్తి కావడంతో రజని లక్ష్మీ మిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ షోరూమ్ లో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగంలో చేరింది.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం
సేలం జిల్లాలోని నేతిమేడు ప్రాంతంలో దినేష్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన దినేష్ ఇంట్లో ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో దినేష్ కు, రజనికి పరిచయం అయ్యింది. కొన్ని నెలల పాటు దినేష్, రంజని సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటూ కాలం గడిపారు.

నేరుగా కలుసుకుంటున్నారు
కొంతకాలం తరువాత దినేష్, రంజనీ ఫోన్ నెంబర్లు మార్చుకుని గంటలు గంటలు మాట్లాడుకున్నారు. తరువాత దినేష్ అప్పుడప్పుడు కోయంబత్తూరు వచ్చి రంజనీని నేరుగా కలుసుకుంటున్నాడు. ఇటీవల దినేష్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, పెళ్లికి ముందే మనం కలిసి ఎంజాయ్ చేద్దామని ఆమెకు చెప్పాడని తెలిసింది.

కత్తితో గర్ల్ ఫ్రెండ్ ముఖం చెక్కేశాడు
ఆ విషయంలో తేడా రావడంతో రంజని దినేష్ తో మాట్లాడకుండా అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. దినేష్ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. చాలాకాలం నుంచి స్నేహితుల ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసినా రంజనీ మాత్రం దినేష్ తో మాట్లాడటానికి ఇష్టపడలేదు. సాయంత్రం నేరుగా కారు షోరూమ్ దగ్గరకు వెళ్లిన దినేష్ అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ రంజనీతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత జోబులో ఉన్న కత్తి తీసుకుని రంజనీ ముఖం, మెడ, ఛాతీ మీద ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు

సోషల్ మీడియాలో జాగ్రత్త
యువతి మీద దాడి చేసిన దినేష్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. షోరూమ్ లో పని చేస్తున్న సాటి ఉద్యోగులు దినేష్ ను పట్టుకుని చితకబాది అతన్ని పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన రంజనీ కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ముక్కుముఖం తెలీకుండా సోషల్ మీడియాలో స్నేహం చేసినందుకు యువతి ఇప్పుడు ఆసుపత్రిపాలైయ్యిందని పోలీసులు అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications