Girlfriend sharing: హోటల్ లో గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్, అర్దరాత్రి ఫ్రెండ్, సోదరుడిని పిలిచి !
మొహాలి/ పంజాబ్/ చెన్నై: నిరుద్యోగిగా తిరుగుతూ కాలం గడిపేస్తున్న యువకుడికి ఓ యువతి పరిచయం అయ్యింది. ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న యువతికి మాయమాటలు చెప్పిన ఆ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ప్రియుడి మయమాటలు నమ్మిన యువతి అతను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లడం మొదలు పెట్టింది. ప్రియురాలికి మాయమాటలు చెప్పిన ఆమె ప్రియుడు ఓ హోటల్ లోకి పిలుచుకుని వెళ్లాడు. హోటల్ లో ప్రియుడితో ఆమె ఏకాంతంగా గడిపింది. తరువాత అర్దరాత్రి హోటల్ రూమ్ బయట మద్యం మత్తులో ఉన్న ప్రియుడు సోదరుడు, ప్రియుడి ఫ్రెండ్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రియుడు కూడా మద్యం సేవించి ప్రియురాలికి అసలు స్వరూపం చూపించాడు. నా సోదరుడికి, నా ఫ్రెండ్ కు నువ్వు పడక సుఖం ఇవ్వాలని ప్రియురాలి మీద ఒత్తిడి చేశాడు. ఓరేయ్ నీఛుడా నువ్వు మనిషా ? పశువా అంటూ ప్రియురాలు ఎదురు తిరిగింది. సోదరుడికి, ఫ్రెండ్ కు పడక సుఖం ఇవ్వడానికి నిరాకరించిన ప్రియురాలిని కత్తితో దారుణంగా పొడిచేసిన ప్రియుడు ఆమెను హోటల్ బయట వదిలేసి అక్కడి నుంచి సోదరుడు, ఫ్రెండ్ తో వెళ్లిపోవడం కలకలం రేపింది.

గాలికి తిరుగుతున్న ప్రియుడు
పంజాబ్ లోని నయగావ్ లో నివాసం ఉంటున్న రాకేష్ సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు ఉద్యోగం చెయ్యకుండా గాలికి తిరుగుతున్నాడు. నిరుద్యోగిగా తిరుగుతూ కాలం గడిపేస్తున్న రాకేష్ కు ఖరార్ లోని సన్నీ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న స్వీటీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పరిచయం అయ్యింది.

మంచి ఉద్యోగం చేస్తున్న ప్రియురాలు
గురుగ్రామ్ లోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో స్వీటీ మంచి ఉద్యోగం చేస్తున్నది. గురుగ్రామ్ లో ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న స్వీటికి మాయమాటలు చెప్పిన రాకేష్ ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. రాకేష్ మంచివాడని నమ్మిన స్వీటి ఎప్పటికైనా రాకేష్ కు మంచి ఉద్యోగం వస్తుందని గుడ్డిగా నమ్మింది.

ప్రియుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెలుతున్న ప్రియురాలు
ప్రియుడు రాకేష్ మయమాటలు నమ్మిన స్వీటీ అతను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లడం మొదలు పెట్టింది. స్వీటీ, రాకేష్ కొంతకాలంగా బైక్ లో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఆఫీసు పని లేని సమయంలో స్వీటీ ఎక్కువగా ఆమె ప్రియుడు రాకేష్ తోనే కాలం గడిపిందని సమాచారం. తన ప్రియురాలు స్వీటీ తనను గుడ్డగా నమ్మిందని రాకేష్ పసిగట్టాడు.

హోటల్ లో ప్రియురాలితో ఎంజాయ్ చేసిన బాయ్ ఫ్రెండ్
తనకు తెలిసిన స్నేహితుడి హోటల్ (లాడ్జ్)లో ఉందని, అక్కడ మనం ఏకాంతంగా గడపడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అక్కడికి వెలుదామని రాకేష్ అతని ప్రియురాలు స్వీటికి చెప్పింది. ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడంలో తప్పు ఏముంది అనుకున్న స్వీటీ శనివారం రాత్రి నయాగాన్ లోని ఓ హోటల్ కు వెళ్లింది. ఆ హోటల్ లో రాకేష్ అతని ప్రియురాలు స్వీటీతో కొన్ని గంటలపాటు ఎంజాయ్ చేశాడు.

సోదరుడు, ఫ్రెండ్ పక్కన పడుకోవాలని చెప్పిన ప్రియుడు
స్వీటితో ఎంజాయ్ చేసిన రాకేష్ అర్దరాత్రి తరువాత హోటల్ రూమ్ డోర్ తీశాడు. రూమ్ బయట మద్యం మత్తులో ఉన్న ప్రియుడు సోదరుడు, ప్రియుడి ఫ్రెండ్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రియుడు రాకేష్ కూడా మద్యం సేవించి అతని ప్రియురాలుస్వీటీకి అసలుస్వరూపం చూపించాడు. నా సోదరుడికి, నా ఫ్రెండ్ కు నువ్వు పడక సుఖం ఇవ్వాలని ప్రియురాలు స్వీటీ మీద రాకేష్ ఒత్తిడి చేశాడు.

ఛీ కొట్టిన ప్రియురాలు.... కత్తితో పొడిచేసిన ప్రియుడు
ప్రియుడు రాకేష్ అతని సోదరుడు, ఫ్రెండ్ కు పడక సుఖం ఇవ్వాలని బలవంతం చెయ్యడంతో స్వీటీ రగిలిపోయింది. ఓరేయ్ నీఛుడా నువ్వు మనిషా ? పశువా అంటూ ప్రియురాలు స్వీటీ ఆమె ప్రియుడు రాకేష్ కు ఎదురు తిరిగి రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. ఆదివారం వేకువ జామున వరకు ప్రియురాలు స్వీటీ మీద ఒత్తిడి చేశాడు. సోదరుడికి, ఫ్రెండ్ కు పడక సుఖం ఇవ్వడానికి నిరాకరించిన ప్రియురాలు స్వీటీని కత్తితో దారుణంగా పొడిచేశాడు.

పారిపోయిన ప్రియుడు
ప్రియుడు రాకేష్ అతని ప్రియురాలిని హోటల్ బయట వదిలేసి అక్కడి నుంచి సోదరుడు, ఫ్రెండ్ తో పరారైనాడు. కత్తిపోట్లకు గురైన స్వీటీ కుప్పకూలి స్పృహ కోల్పోయింది. విషయం గుర్తించిన హోటల్ సిబ్బంది, స్థానికులు స్వీటీని ఛండీగఢ్ సెక్టార్ 16లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రియుడికి బెండ్ తీసిన పోలీసులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వీటీ విషయం చెప్పడంతో పోలీసులు రాకేష్ ను పట్టుకుని బెండ్ తీసి అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. రాకేష్ సోదరుడు, అతని ఫ్రెండ్ పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. హోటల్ లో ప్రియుడు అతని గర్ల్ ఫ్రెండ్ ని అతని సోదరుడు, స్నేహితుడి పక్కలో పడుకోవాలని ఒత్తిడి చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి బేకారుగా తిరుగుతున్న యువకుడిని ప్రేమించడమే కాకుండా అతను హోటల్ కు పిలిస్తే గుడ్డిగా ఏమీ ఆలోచించకుండా వెళ్లి ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకుందని పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications