ఐటీ హబ్ లో ఒకే కంపెనీలో లవర్స్, బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో 13 వేల నగ్న వీడియోలు, కంపెనీ లేడీస్ తో ?

బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ బీపీఓ కంపెనీలో పనిచేస్తున్న యువతి ఆమె ప్రియుడి మొబైల్ చూసి షాకైంది. తన ప్రేమికుడి మొబైల్ లాక్ తీసి అందులోని ఫోటో గ్యాలరీని చూసిన ప్రియురాలు షాక్ అయ్యింది. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రియుడి మానసిక స్థితి గురించి అతని ప్రియురాలు ఆందోళన చెందుతోంది. అయితే ప్రియురాలి దెబ్బతో ఆమె ప్రియుడు జైలుపాలైనాడు.

బెంగళూరు నగరంలోని బెళ్లందరూరు సమీపంలోని ఓ బీపీఓ కంపెనీలో ఆదిత్య సంతోష్ అనే యువకుడు, స్వప్నప్రియా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతకాలంగా సంతోష్ ఆదిత్య, స్వప్న ప్రియా ప్రేమించుకుంటున్నారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రియా, సంతోష్ ఉద్యోగం పూర్తి అయిన తరువాత సినిమాలు, షికార్లకు తిరుగుతున్నారు.

Girlfriend shocked to see 13 thousand nude photos in boyfriends mobile phone gallery in Bengaluru.

ఇటీవల ప్రేమికులు సంతోష్, ప్రియా ఏకాంతంగా గడపడం మొదలుపెట్టారని తెలిసింది. ఆ సందర్బంలో ప్రియురాలు ప్రియాకు తెలీకుండా సంతోష్ ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడని తెలిసింది. ఇటీవల ప్రియా ఆమె ప్రియుడు సంతోష్ మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ చేసి అందులోని ఫోటో గ్యాలరీని పరిశీలించింది. ప్రియుడు సంతోష్ ఫోన్ లోని ఫోటో గ్యాలరీలో కొంతమంది సహోద్యోగులతో సహా వివిధ మహిళలకు సంబంధించిన 13,000 నగ్న ఫోటోలు కనిపించాయి.

ప్రియుడు సంతోష్ మొబైల్ ఫోన్ లోని ఫోటో గ్యాలరీ చూసిన ప్రియా హడలిపోయింది. సహోద్యోగులతో పాటు తన నగ్న ఫోటోలు ప్రియుడు సంతోష్ మొబైల్ లో ఉన్నాయని గుర్తించిన ప్రియా హడలిపోయింది. సంతోష్ మొబైల్‌ ఫోన్ లో అతని కార్యాలయంలోని సహోద్యోగుల నగ్న ఫోటోలు చూసిన ప్రియురాలికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే ప్రియా ఆ విషయాన్ని ఆమె ఉద్యోగం చేస్తున్న కార్యాలయం చీఫ్ కు చెప్పింది.

Girlfriend shocked to see 13 thousand nude photos in boyfriends mobile phone gallery in Bengaluru.

భవిష్యత్తులో సంస్థకు చెడ్డపేరు రాకుండా ఉండాలన్నా, సంస్థలోని ఇతర మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నా వెంటనే తన ప్రియుడు సంతోష్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియురాలు ప్రియా సంబంధిత అధికారులను అభ్యర్థించింది. బెళ్లందూర్‌లోని బీపీవో కంపెనీ అధినేత వెంటనే ఆ కంపెనీలో పని చేస్తున్న ప్రియా ప్రియుడు ఆదిత్య సంతోష్ పై బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంతోష్, ప్రియా కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ప్రియాతో గడిపిన వ్యక్తిగత క్షణాలను నిందితుడు సంతోష్ అతని మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడని అతని ప్రియురాలు చూసింది. తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలని ఇటీవల ప్రియురాలు ప్రియా పదేపదే ఆమె ప్రియుడు సంతోష్ కు చెప్పింది. అయితే సంతోష్ మాత్రం ఆ ఫోటోలు డిలీట్ చెయ్యలేదని తెలిసింది.

ప్రియుడు సంతోష్‌కి తెలియకుండా అతని ఫోన్ తీసుకున్న ప్రియా అందులోకి ఫోటో గ్యాలరీని ఓపెన్ చేసింది. ఈసారి అతని మొబైల్‌లో 13 వేల న్యూడ్ ఫోటోలు చిక్కడంతో ప్రియా హడలిపోయింది. సంతోష్ సాటి సహోద్యోగుల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఉంటాడని అతని ప్రియురాలు ప్రియా అనుమానించింది. దీనిపై కేసు నమోదు చేసి తన ప్రియుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది.

Girlfriend shocked to see 13 thousand nude photos in boyfriends mobile phone gallery in Bengaluru.

ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యంకు తెలియజేసిని ప్రియా సంతోష్ మీద చర్యలు తీసుకోకుంటే కార్యాలయంలోని ఇతర మహిళల జీవితాలపై ప్రభావం చూపుతుందని ఆరోపించింది. సంతోష్ అసలు ఉద్దేశ్యం ఎవరికీ తెలియదు. ఆ ఫోటోలు లీక్ అయితే మహిళల జీవితాలు నాశనం అవుతాయని ప్రియా ఆందోళన వ్యక్తం చేసింది. సంతోష్ గత ఐదు నెలలుగా కంపెనీలో కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

తన సహోద్యోగుల ఫోటోలను మార్ఫింగ్ చేయడానికి సంతోష్ కంపెనీకి చెందిన కంప్యూటర్లు, ఇతర పరికరాలు ఉపయోగించలేదని కంపెనీ స్పష్టం చేసింది. సంతోష్‌పై కేసు నమోదు చేశామని, అతన్ని కార్యాలయంలోనే అరెస్టు చేశామని పోలీసు అధికారి తెలిపారు. సంతోష్ అతని మొబైల్ లోని ఫోటో గ్యాలరీలో ఇన్ని ఫోటోలు ఎందుకు ఉంచాడనే విషయంపై కూడా విచారణ చేస్తున్నామని, ఫోటోలు కొంతవరకు మార్ఫింగ్ చేయబడ్డాయని, కొన్ని నిజమైన ఫోటోలు ఉన్నాయని, అతని ఫోన్ కాల్స్‌ను, అతని చాటింగ్స్ కూడా తనిఖీ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+