Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: ప్రియురాలిని 35 ముక్కలు చేశాడు, వంట గదిలో సాక్షాలు వదిలేశాడు, నార్కో పరీక్షలు !

న్యూఢిల్లీ/ ముంబాయి: కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రియురాలు అపార్ట్ మెంట్ తీసుకుని ఆమె ప్రియుడితో డేటింగ్ చేసింది. యువతి మాయం కావడంతో ఆమె తండ్రి పోలీసు కేసు పెట్టాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చేశాయి. కనపడకుండా పోయిన యువతిని హత్య చేసిన ప్రియుడు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడని వెలుగు చూసింది. పోలీసుల విచారణలో ప్రియుడు దిమ్మతిరిగిపోయే విషయాలు చెబుతున్నాడు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఫ్లాట్ వాటర్ బిట్ కట్టకపోవడంతో ప్రియుడు అడ్డంగా చిక్కిపోయాడు. అపార్ట్ మెంట్ లో గ్యాస్ సిలిండర్ ఉన్న చోట పోలీసులకు సాక్షాలు చిక్కాయని వెలుగు చూసింది. ప్రియుడికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడాని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 ముంబాయిలో లవర్స్

ముంబాయిలో లవర్స్

ముంబాయిలో ప్రముఖ కార్పోరేట్ కంపెనీకి చెందిన కాల్ సెంటర్ లో శ్రద్దా (26) అనే యువతి ఉద్యోగంలో చేసే సమయంలో అఫ్తాబ్ పూనవల్లా అలియాస్ అఫ్తాబ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత శ్రద్దా, అఫ్తాబ్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన శ్రద్దా ఆమె ప్రియుడు హఫ్తాబ్ తో ఢిల్లీ పారిపోయి అతనితో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది.

 పెళ్లి చేసుకోమంటే ప్రియరాలిని చంపేశాడు

పెళ్లి చేసుకోమంటే ప్రియరాలిని చంపేశాడు

పెళ్లికాకుండా శ్రద్దా, హఫాబ్ సహజీనం చేశారు. పెళ్లి చేసుకుందామని శ్రద్దా ఆమె ప్రియుడు అఫ్తాబ్ మీద ఒత్తిడి చేసింది. అయితే శ్రద్దాను పెళ్లి చేసుకోవడం హఫ్తాబ్ కు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రియురాలు శ్రద్దా టార్చర్ ఎక్కువ కావడంతో కొన్ని నెలల క్రితం హఫ్తాబ్ ఆమెను అపార్ట్ మెంట్ లోనే దారుణంగా చంపేశాడు.

 ప్రియురాలిని ముక్కలుగా నరికేశాడు

ప్రియురాలిని ముక్కలుగా నరికేశాడు

అఫ్తాబ్ 300 లీటర్ల ఫ్రిజ్ ఒకటి తీసుకు వచ్చి అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో పెట్టాడు.శ్రద్దాను హత్య చేసిన హఫ్తాద్ ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. శ్రద్దా శరీరంలోని ముక్కలు ప్లాస్టిక్ కవర్లలో వేసి వాటిని ఫ్రిజ్ లో పెట్టాడు. తరువాత రోజుకు కొన్ని ముక్కలు బయటకు తీసుకెళ్లి అటవి ప్రాంతంలో విసిరేసి చేతులు దులుపుకున్నాడు.

 పోలీసుల మైండ్ బ్లాక్

పోలీసుల మైండ్ బ్లాక్

శ్రద్దా మాయం కావడంతో ఆమె తండ్రి ఢిల్లీలో పోలీసు కేసు పెట్టాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చేశాయి. కనపడకుండా పోయిన శ్రద్దాను ఆమె ప్రియుడు హఫ్తాబ్ దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడని వెలుగు చూసింది. పోలీసుల విచారణలో శ్రద్దా ప్రియుడు హఫ్తాబ్ దిమ్మతిరిగిపోయే విషయాలు చెబుతున్నాడు.

 అపార్ట్ మెంట్ లో రక్తపు మరకలు, ప్రియుడికి నార్కో పరీక్షలు

అపార్ట్ మెంట్ లో రక్తపు మరకలు, ప్రియుడికి నార్కో పరీక్షలు

శ్రద్దా ఆమె ప్రియుడితో కలిసి నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ఫ్లాట్ కు వాటర్ బిట్ కట్టకపోవడంతో ప్రియుడు హఫ్తాబ్ అడ్డంగా చిక్కిపోయాడు. అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ లో గ్యాస్ సిలిండర్ పెట్టే చోట రక్తపు మరకలు ఉండటంతో పోలీసులకు ఆ సాక్షాలు సేకరించారు. శ్రద్దా ప్రియుడు హఫ్తాబ్ కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+