Girlfriend: రెచ్చిపోయిన లవర్, ప్రియురాలి అమ్మ ఎంట్రీతో రివర్స్, ప్రియుడిని నరికేసి, రివర్స్!
చెన్నై/తిరువూర్: కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి వేరే మతం అబ్బాయితో పరిచయం పెంచుకుంది. తమ కుమార్తె ముస్లీం యువకుడితో తిరుగుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇదే సమయంలో కుమార్తెను కంట్రోల్ పెట్టడానికి ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఇదే విషయంలో పెద్దపెద్ద రామయాణాలు జరిగాయి. అయితే మా అమ్మాయికి మాయమాటలు చెబుతున్న యువకుడు ఆమెను వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు రగిలిపోయాడు. ప్రియుడి ఇంటికి వెళ్లిన అమ్మాయి తల్లిదండ్రులు ఒక్కసారిగా కత్తి, కొడవలితో కూతురి ప్రియుడిని నరికేశారు. ప్రియుడు కుటుంబ సభ్యులు, బంధువులు అమ్మాయి తండ్రి నిర్వహిస్తున్న మెడికల్ స్టోర్ ను ధ్వంసం చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని తిరువూర్ లో ఆదియక్కళం ప్రాంతంలో విజయ్ కుమార్, దీపా దంపతులు నివాసం ఉంటున్నారు. మెడికల్ షాప్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విజయ్ కుమార్, దీపా దంపతులకు 17 సంవత్సరాల వయసు ఉన్న రజని (పేరు మార్చడం జరిగింది) అనే కుమార్తె ఉంది. దీపా కాలేజ్ లో ఇంటర్ చదువుతోంది.

ముస్లీం యువకుడు బాయ్ ఫ్రెండ్
తిరువూర్ లోని మసీదు వీధిలో బకృద్దీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బకృద్దీన్ కుమారుడు మోహమ్మద్ ఫెమినాస్ అలియాస్ మోహమ్మద్ (23) రజనికి పరిచయం అయ్యాడు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న రజని మోహమ్మద్ తో ప్రేమలో పడింది. కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో కాలేజ్ మూసి వేయడంతో రజని ఇంటికే పరిమితం అయ్యింది.

అమ్మానాన్న ఫైర్
కాలేజ్ మూసి వేయడంతో ఇంట్లోనే ఉంటున్న రజని కోసం ఆమె ప్రియుడు మోహమ్మద్ ప్రియురాలి ఇంటిచుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. పదేపదే మోహమ్మద్ తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని గుర్తించిన రజని తల్లి దీపా అతన్ని నిలదీసింది. మా అమ్మాయి జోలికి రాకూడదని దీపా కూతురు బాయ్ ఫ్రెండ్ మోహమ్మద్ కు గట్టిగా వర్నింగ్ ఇచ్చింది.

ప్రియుడు మారలేదు
ప్రియురాలు తల్లి దీపా వార్నింగ్ ఇచ్చినా ప్రియుడు మోహమ్మద్ మాత్రం ప్రియురాలు దీపా ఇంటి చుట్టూ తిరుగూతనే ఉన్నాడు. కూతురి విషయం గురించి దీపా ఆమె భర్త విజయ్ కుమార్ కు చెప్పింది. ఎలాగైనా మోహమ్మద్ కు బుద్ది చెప్పాలని విజయ్ కుమార్, దీపా దంపతులు డిసైడ్ అయ్యారు.

ఏం చేస్తారో చేసుకోండి
విజయ్ కుమార్, దీపా దంపతులు నేరుగా మోహమ్మద్ ఇంటికి వెళ్లారు. మా అమ్మాయి హిందువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందని, నువ్వు మా ఇంటి వైపు రాకూడదని విజయ్ కుమార్, దీపా దంపతులు మోహమ్మద్ కు చెప్పారు. నేను మీ కూతురినే పెళ్లి చేసుకుంటాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ మోహమ్మద్ ఎదురు తిరిగాడు.

ప్రియుడిని నరికేసిన ప్రియురాలు అమ్మానాన్న
మోహమ్మద్ రెచ్చిపోవడంతో దీపా కత్తి తీసుకుని మోహమ్మద్ మీద దాడి చేసింది. అదే సమయంలో విజయ్ కుమార్ కూడా కొడవలి తీసుకుని మోహమ్మద్ మీద దాడి చెయ్యడంతో అతను కుప్పకూలిపోయాడు. వెంటనే మోహమ్మద్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మోహమ్మద్ బంధువులు విజయ్ కుమార్ నిర్వహిస్తున్న మోడికల్ షాపు మీద దాడి చేసి ధ్వంసం చేశారు.
Recommended Video

ప్రియురాలి అమ్మానాన్న అరెస్టు..... వెయిటింగ్ లిస్టులో ప్రియుడు !
మోహమ్మద్ మీద దాడి చేసి పారిపోయిన విజయ్ కుమార్, దీపా దంపతులు మైలాడుతురైలో తలదాచుకున్నారని తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహమ్మద్ మా అమ్మాయిని లేంగిక వేధింపులకు గురి చేస్తున్నారని విజయ్ కుమార్, దీపా దంపతులు కేసు పెట్టారు. మోహమ్మద్ కోలుకున్న తరువాత అతన్ని అరెస్టు చేస్తామని పోలీసులు అన్నారు. ముందుజాగ్రత్త చర్యగా మోహమ్మద్, విజయ్ కుమార్ నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications