Girlfriend: చిన్ననాటి ఫ్రెండ్స్, ఫ్రెండ్ చెల్లెలితో ? వేరే అబ్బాయితో ఆమె పెళ్లి, క్లైమాక్స్ లో !
లక్నో/ ఉత్తరప్రదేశ్: ఇద్దరు యువకులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. సిటీలో ఇద్దరూ ఒకేచోట ఒకే పని చేస్తున్నారు. స్నేహితుడి చెల్లిని అతని ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడు. స్నేహితుడి కోసం అతని ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు అతని చెల్లెలితో చనువుగా మాట్లాడుతున్నాడు. స్నేహితుడి చెల్లెలు చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు ఆశపడ్డాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ యువకుడు ఫ్రెండ్ చెల్లికి చెప్పాడు. అయితే అక్కడే మ్యాటర్ రివర్స్ అయ్యింది. నేను నిన్ను అలా ఊహించుకోలేదని, నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ యువతి తేల్చి చెప్పింది. అంతే యువతి ఇంట్లోనే ఒంటిమీద పెట్రోల్ పోసుకున్న యువకుడు నిప్పంటించుకున్నాడు. యువకుడికి మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన యువతి సోదరుడితో పాటు అతని కుటంబ సభ్యులకు మంటలు వ్యాపించడంతో కొందరికి తీవ్రగాయాలైనాయి. పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించడంతో ఆమె ఇంట్లోనే వన్ సైడ్ లవర్ సజీవదహనం కావడం కలకలం రేపింది.

చిన్నప్పటి ఫ్రెండ్స్
ఉత్తరప్రదేశ్ లోని గూండా జిల్లాలోని ఫరూకాబాద్ లో విమల్ కిశోర్ అలియాస్ కిశోర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విమల్ కిశోర్, రాజేష్ అనే యువకుడు చిన్నప్పటి నుంచి స్నేహితులు. లక్నోలో ఇద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నారు. ఇద్దరూ సొంత ఊరికి ఒకేసారి రావడం, కొన్ని రోజులు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న కిశోర్ రాజేష్ తరువాత లక్నోకి వెళ్లి అక్కడ ఒకేచోట ఒకే పని చేస్తున్నారు.

ఫ్రెండ్ చెల్లిని ప్రేమించిన యువకుడు
స్నేహితుడు రాజేష్ కోసం అతని ఇంటికి వెళ్లి వస్తున్న కిశోర్ అతని చెల్లెలితో చనువుగా మాట్లాడుతున్నాడు. స్నేహితుడు రాజేష్ చెల్లెలు చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని కిశోర్ ఆశపడ్డాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని కిశోర్ అతని ఫ్రెండ్ రాజేష్ చెల్లికి చెప్పాడు.

పెళ్లి చేసుకోవాలి అనుకున్న వన్ సైడ్ లవర్
కొంతకాలం పాటు రాజేష్ చెల్లెలికి ఏ విషయం చెప్పకుండా చాలా సైలెంట్ గా ఉండిపోయింది. చివరికి నేను నిన్ను అలా ఊహించుకోలేదని, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ యువతి కిశోర్ కు తేల్చి చెప్పింది. అప్పటి నుంచి కిశోర్ ఆవేదనతో ఉన్నాడు. ఎప్పటికైనా నేను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవాలని ఎదురు చూశాడు. అయితే కిశోర్ అనుకున్నట్లు జరగలేదు.

యువతి ఇంట్లోనే నిప్పంటించుకున్నాడు
కిశోర్ అతని స్నేహితుడు రాజేష్ ఇంటికి వెళ్లాడు. అక్కడ రాజేష్ చెల్లెలి పెళ్లి విషయంలో టాపిక్ మొదలైయ్యింది. వేరే యువకుడితో మా అమ్మాయి పెళ్లి జరిపిస్తున్నామని, నువ్వు ఇక ముందు ఆమె విషయంలో జోక్యం చేసుకోకూడదని రాజేష్ తల్లిదండ్రులు కిశోర్ కు తేల్చి చెప్పారు. అంతే ఆవేశంతో ఊగిపోయిన కిశోర్ యువతి ఇంట్లోనే ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ప్రియురాలి ఇంట్లోనే సజీవదహనం
కిశోర్ కు అంటుకున్న మంటలు ఆదుపు చెయ్యడానికి ప్రయత్నించిన యువతి సోదరుడు రాజేష్ తో పాటు అతని కుటంబ సభ్యులకు మంటలు వ్యాపించడంతో తీవ్రగాయాలైనాయి. పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించడంతో ఆమె ఇంట్లోనే వన్ సైడ్ లవర్ కిశోర్ సజీవదహనం కావడం కలకలం రేపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications