Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

63ఏళ్ల కాలేజీ చైర్మన్ రాసలీలలు: స్టాఫ్, అమ్మాయిల్ని బలవంతంగా దగ్గరకు తీసుకొని ముద్దులిస్తూ

Recommended Video

    63ఏళ్ల కాలేజీ చైర్మన్ రాసలీలలు: అమ్మాయిల్ని బలవంతంగా దగ్గరకు తీసుకొని ముద్దులిస్తూ

    కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ కాలేజీలో కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎవరో తీశారు. వాటిని బయటకు తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    విద్యార్థినులతో పాటు లెక్చరర్ల పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోలు, ఫోటోలను పోలీసులకు అందించారు. దీంతో విషయం వెలుగు చూసింది.

     రెండేళ్లుగా లైంగిక వేధింపులు

    రెండేళ్లుగా లైంగిక వేధింపులు

    ఈ ఘటన జరిగింది కోయంబత్తూరు.. శరవణంపట్టిలోని ఎస్ఎన్ఎస్ కాలేజీలో చోటు చేసుకుంది. ఈ కాలేజీ కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతని వయస్సు 63. ఇతను గత రెండేళ్లుగా విద్యార్థినులతో పాటు స్టాఫ్‌పై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.

     కొడుకుకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులు

    కొడుకుకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులు

    అతని వేధింపుల విషయమై గతంలో కాలేజీలోని కిందిస్థాయి సిబ్బంది, పలువురు అమ్మాయిలు... అతని కొడుకుకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నేపథ్యంలో అతనిపై చర్యలకు బదులు ఫిర్యాదు చేసిన వారినే బెదిరించారు.

    విదేశాల్లో ఇలాంటివి సాధారణమే అంటూ

    విదేశాల్లో ఇలాంటివి సాధారణమే అంటూ

    మరో దారుణమైన విషయం ఏమంటే.. విదేశాలలో ఇలాంటి వేధింపులు (లైంగిక వేధింపులు) సాధారణమేనని మేనేజ్‌మెంట్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, వీటిని పెద్ద సమస్యగా చేయవద్దని హెచ్చరించారు.

     బాధితురాలికి బెదిరింపులు

    బాధితురాలికి బెదిరింపులు

    ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఓ బాధితురాలు తుడియలూర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు తెలిసిన మేనేజ్‌మెంట్.. ఆమెను తీవ్రంగా హెచ్చరించింది. చంపేస్తామని కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది.

     ఏం చేయలేని స్థితిలో ఫోటోలు, వీడియోలు విడుదల

    ఏం చేయలేని స్థితిలో ఫోటోలు, వీడియోలు విడుదల

    బాధితురాలికి తీవ్రమైన బెదిరింపులు రావడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమె అతని వేధింపులకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఆధారాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఇలా చేయడమే కాకుండా, ఫిర్యాదు చేసినందుకు తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

    అమ్మాయిల్ని బలవంతంగా దగ్గరకు తీసుకొని, ముద్దులు

    అమ్మాయిల్ని బలవంతంగా దగ్గరకు తీసుకొని, ముద్దులు

    ఇప్పుడు ఫిర్యాదు చేసిన బాధితురాలు... కాలేజీలో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయి. అతను మహిళలను బలవంతంగా దగ్గరకు తీసుకొని, కౌగిలించుకోవడం, ముద్దులు ఇవ్వడం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా అతను పలువురిని వేధింపులకు గురి చేశాడు.

    చాలామంది ఉద్యోగం వదిలి వెళ్లారు

    చాలామంది ఉద్యోగం వదిలి వెళ్లారు

    అతని లైంగిక వేధింపులు తాళలేక పలువురు మహిళలు ఉద్యోగం వదిలేశారు. ఇప్పుడు ఫిర్యాదు చేసిన బాధితురాలిని గత రెండేళ్లుగా వేధించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

    వాట్సాప్ సందేశాలు

    అంతేకాదు, అతని కొడుకుతో చేసిన వాట్సాప్ సందేశాలను, ఫిర్యాదులను కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఆమె అతని తండ్రి గురించి ఫిర్యాదు చేసింది. మీరొక్కరే ఈ విషయంలో నాకు సహాయం చేయగలరని భావిస్తున్నానని పేర్కొన్నారు. నాకు ఏమైనా జరిగితే, మీది, మీ తండ్రితే బాధ్యత అని, నేను బతకడం వృథా అని ఓ సందేశంలో పేర్కొన్నారు.

    వ్యక్తిగతంగా వచ్చి కలవమని..

    వ్యక్తిగతంగా వచ్చి కలవమని..

    ఈ విషయమై బాధితురాలితో అతని కొడుకు మాట్లాడుతూ... మీరు వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలవమని చెప్పాడని పేర్కొన్నాడని బాధితురాలి తెలిపింది. వచ్చి కలిస్తే సమస్యపై మాట్లాడుదామని చెప్పాడని అంది. దానికి ఆమె అతని సందేశంతో షాకయింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+