Go First: ఆ విమానాలు క్రమంగా కనుమరుగు..?!

ముంబై: దేశీయ పౌర విమానయాన సంస్థ గో ఫస్ట్.. కీలక ప్రకటన చేసింది. తమ సంస్థకు చెందిన విమాన సర్వీసులన్నింటినీ మరో రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులతో పాటు సరుకుల రవాణా సేవల రద్దును కూడా పొడిగించినట్లు తెలిపింది. రద్దు- ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఆ మేరకు ఆ సంస్థ యాజమాన్యం కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దు గడువు ముగిసిన తరువాత అప్పటి పరిస్థితులను బట్టి విమాన సర్వీసులను పునరుద్ధరించడమా? లేక మరిన్ని రోజుల పాటు పొడిగించడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తోన్నామని, అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

 gofirst

గో ఫస్ట్ యాజమాన్యం.. కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే దివాళా తీసినట్లు ప్రకటించింది. దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థల్లో మూడో స్థానంలో ఉంటూ వచ్చిన గో ఫస్ట్ ఎయిర్ లైన్స్‌కు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కాలం ఆర్థికంగా దెబ్బకొట్టింది. అప్పట్లో అమలు చేసిన లాక్‌డౌన్ పరిస్థితుల నుంచి కోలుకోలేపోయింది.

విమాన ఇంజిన్ వైఫల్యాలు దీనికి తోడయ్యాయి. ఇంజిన్ వైఫల్యాలతో నాలుగు సంవత్సరాల పాటు సతమతమైందా కంపెనీ. ఇంజిన్లల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల మెజారిటీ సంఖ్యలో విమానాలు గాల్లోకి ఎగరని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వరుసగా మూడు సంవత్సరాల పాటు భారీ నష్టాలను చవి చూసింది. 65.21 బిలియన్ల మేర రుణాలను చూపించిందా సంస్థ యాజమాన్యం.

 gofirst

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి రేథియాన్ యాజమాన్యంలోని ఆర్టీఎక్స్-ఎన్, ప్రాట్ & విట్నీ కంపెనీకి చెందిన ఇంజిన్‌లను వినియోగించడమే ప్రధాన కారణమని, తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల సర్వీసులను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందంటూ వాపోయిందా సంస్థ యాజమాన్యం. ఏకంగా దివాళా తీసినట్లు ప్రకటించింది.

రుణాలను తీర్చే పరిస్థితిలో లేమంటూ ఈ నెల మొదటి వారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తెలియజేసింది. ఈ మేరకు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరకుపోయిన నేపథ్యంలో- ఈ నెల 26వ తేదీ వరకు విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసినట్లు ఈ నెల 3వ తేదీన ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఈ రద్దును పొడిగించింది. 28వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+