రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన రైలు
ముంబై: మహారాష్ట్రలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రత్నగిరి సమీపంలో సొరంగంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదని, రైలులో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా మడ్గావ్ వైపు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ రైలు - 02414 - గోవాలోని మద్గావ్‌కు వెళుతుండగా, ముంబై నుంచి సుమారు 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బూడ్ సొరంగం లోపల తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో పట్టాలు తప్పినట్లు ఈ మార్గాన్ని నిర్వహిస్తున్న కొంకణ్ రైల్వే ప్రతినిధి తెలిపారు. పట్టాలపై ఒక బండరాయి పడిపోయిందని, ఇది పట్టాలు తప్పడానికి దారితీసిందని ఆయన అన్నారు.

కొంకణ్ రైల్వేలోని రత్నగిరి ప్రాంతంలోని ఉక్షి, భోక్ స్టేషన్ల మధ్య ఉన్న కార్బూడ్ సొరంగంలో రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు లోకోమోటివ్ ముందు చక్రం పట్టాలు తప్పిందని అధికారి తెలిపారు. ఒక రైలు నిర్వహణ వాహనం (ఆర్‌ఎంవి) ఈ స్థలానికి చేరుకుంది. రీ-రైలింగ్ పరికరాలను కలిగి ఉన్న యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ (ఎఆర్‌ఎంవి) పునరుద్ధరణ పనుల కోసం రత్నగిరి నుంచి ప్రమాద స్థలికి బయలుదేరిందని తెలిపారు.
కొంకణ్ రైల్వే అధికారులు కూడా లైన్ క్లియర్ చేయడానికి స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. కొంకణ్ రైల్వే ముంబై సమీపంలోని రోహా, మంగళూరు సమీపంలోని తోకూర్ మధ్య 756 కిలోమీటర్ల పొడవున నడుస్తుంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఈ మార్గం అనేక నదులు, లోయలు, పర్వతాలతో సవాలు చేసే భూభాగాలలో ఒకటిగా ఉంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications