సముద్రంలో విహారయాత్ర.. అతి తక్కువ బడ్జెట్ లో.. ఎక్కడంటే..?
గోవా టూర్ అంటే పర్యటకులకు మరచిపోలేని అనుభూతి. అందమైన బీచ్ లు, ప్రకృతి అందాలు, క్రూయిజ్ జర్నీలు, పార్టీలకు ప్రసిద్ధి చెందింది. భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా గోవాకు పర్యటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవి కన్నా వర్షాకాలం, శీతాకాలంలోనే గోవా చూడటానికి అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు.
గోవాలోని బటర్ ఫ్లై బీచ్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే కేసర్వాల్ జలపాతాలు కూడా మంచి అనుభూతిని అందిస్తాయి. ఇక్కడి నీటిలో ఈత కొడితే సహజంగా మసాజ్ లా అనిపిస్తుందని చెబుతారు. ఇక గోవాలో చపోరా నదిపై పడవ ప్రయాణం సరికొత్త అనుభూతిని అందిస్తుంది. సాల్ నది మడ అడవులు కూడా పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ కింగ్ ఫిషర్ పక్షులు, డాల్ఫిన్లు కనువిందు చేస్తాయి. అలాగే మయెం సరస్సు చుట్టుపక్కల పాత పోర్చుగీస్ శైలిలో ఇళ్లు, గ్రామాలు కనిపిస్తాయి.
గోవా క్రూయిజ్ జర్నీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారీ తెల్లటి క్రూయిజ్ నౌకపై ప్రయాణం ఓ మరచిపోలేని అనుభూతి. క్రూయిజ్ జర్నీలో డ్యాన్స్ షోలు, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి. క్రూయిజ్ లోనే పిల్లలకు గేమ్ ఏరియా ఉంటుంది. పెద్దలు లౌంజ్ లో సరదాగా గడుపుతారు. యువత పార్టీ నైట్ లో ఎంజాయ్ చేయోచ్చు. క్రూయిజ్ జర్నీ ప్యాకేజీలో భాగంగానే గోవాలోని ప్రసిద్ధ చర్చిలు, బీచ్ లు, అడ్వెంచర్ గేమ్స్ , కయాకింగ్, బనానా రైడ్, జెట్ స్కీ.. తదితర వాటిని ఎంజాయ్ చేయోచ్చు.

ఇక ఈ క్రూయిజ్ ప్యాకేజీ ధర రూ. 12,577 నుండి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలోనే భోజనం, డ్రింక్స్, షోలు, వినోద కార్యక్రమాలు, గదులు, క్రూయిజ్ టూర్, గోవా లోకల్ టూర్స్ అన్నీ కలుపుకుని ఉంటాయి. డిసెంబర్ నుంచి అధికారిక సైలింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. బుకింగ్ కోసం Cordelia Cruises అధికారిక వెబ్ సైట్ ద్వారా నేరుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications