Goa NesX Polsstart exit poll: సేమ్ సీన్ రిపీట్ అయితే ?, దేవుడే దిక్కు, కథ కంచికే !
గోవా/పణజి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీతో పాటు, కాంగ్రెస్ పార్టీకి, పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు సవాలుగా స్వీకరించాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడం, ఇదే నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల్లో టెన్సన్ మొదలైయ్యింది, పైకి పలు సర్వేల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని తెలిసినా ఇవి కచ్చితమైన ఫలితాలు మాత్రం కాదు. సర్వే ఫలితాలు బయటకు వచ్చినా చివరి నిమిషయంలో సర్వేలు కూడా తారుమారు అయ్యే అవకావం ఉంది. గోవాలో సింగిల్ పార్టీ ప్రభత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. 2017లో సీన్ రిపీట్ అవుతుందని మరోసారి వెలుగు చూసింది. గోవాలో బీజేపీ కాని, కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే కచ్చితంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు కచ్చితంగా తీసుకోవాలని, ఎవరి మద్దతు లేకుండా రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని వెలుగు చూసింది. Nesx Polsstart సర్వే ప్రకారం గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజరిటీ రాదని వెలుగు చూసింది.

2017లో పడిన దెబ్బ ఇంకా మరిచిపోలేదు
గోవాలో 40 మంది శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017లో గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. 2017లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రూపు రాజకీయల కారణంగా గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోయారు.

సేమ్ సీన్ రిపీట్ అయితే ?
2017లో సీన్ రిపీట్ అవుతుందని మరోసారి వెలుగు చూసింది. గోవాలో బీజేపీ కాని, కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే కచ్చితంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు కచ్చితంగా తీసుకోవాలని, ఎవరి మద్దతు లేకుండా రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని వెలుగు చూసింది.

Nesx Polsstart సర్వే
గోవాలో పలు మీడియా సంస్థలు, పలు పార్టీల నాయకులు ఎగ్జిట్ పోల్ సర్వేలు చేశారు. శనివారం రాత్రి గోవా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. Nesx Polsstart సర్వే ప్రకారం గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజరిటీ రాదని వెలుగు చూసింది. 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 17 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 13 సీట్లు, ఆప్ కు 1 నుంచి 4 సీట్లు, ఇతరులు 2 నుంచి 7 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.












Click it and Unblock the Notifications