‘నా ఒళ్లంతా రక్తం, నగ్నంగా అతడు’: రేపిస్టు ఎమ్మెల్యేపై బాలిక

పనాజీ: గోవాను కుదిపేస్తున్న మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తు్న్నాయి. వివాదాస్పద గోవా మాజీ విద్యాశాఖ మంత్రి, బహిష్కృత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాబుష్ మోన్సరేట్‌పై ఓ నేపాలీ అమ్మాయిని కొనుగోలు చేసి, ఆమెపై అత్యాచారం జరిపినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనపై మానవ అక్రమ రవాణా, రేప్ అభియోగాలను మోపినట్టు పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి.
నమోదైన అత్యాచారం కేసును క్రైం బ్రాంచికి తరలిస్తున్నట్లు గురువారం సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు. కాగా, గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే అటాసినో మోన్సరేట్ పోలీసులు ముందు లొంగిపోయాడు.

అటాసినో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై కుట్రపన్ని ఈ కేసు పెట్టారన్నారు. బాలిక తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని కోరితే ఉద్యోగం ఇచ్చానని చెప్పారు. ఆమె క్యాష్‌ కౌంటర్‌లో డబ్బు దొంగిలించడంతో ఉద్యోగం నుంచి తొలగించానన్నారు. ఆమె చేసిన ఫిర్యాదులో ఏమాత్రం నిజం లేదన్నారు.

Goa Lawmaker Babush Monserrate, Charged With Raping Teen, Surrenders

సవతి తల్లి అమ్మేసింది

తనను తన సవతి తల్లి, తన 'ఆంటీ' కలిసి ఎమ్మెల్యే మోన్సిరేట్‌‌కు అమ్మేశారని నేపాల్‌కు చెందిన 16ఏళ్ల బాధిత బాలిక.. పోలీసులకు తెలిపింది. అతను తనను తన బంగ్లాకు తీసుకెళ్లాడని, అక్కడ తనకు మద్యం తాగించి అత్యాచారం జరిపాడని ఆమె పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.

'ఆ రోజు తెల్లారి నేను లేచిచూసేసరికి.. నా ఒంటిమీద దుస్తులు లేవు. రక్తంతో నేను తడిసిపోయి ఉన్నాను. నా పక్కన ఆయన బట్టలు లేకుండా నగ్నంగా కూచోని ఉన్నాడు' అని ఆమె గోవా బాలల సంరక్షణ కమిటీకి తెలిపినట్టు తెలిసింది.

ఉద్యోగం కోసం మోన్సిరేట్‌ను నువ్వు కలువబోతున్నావని, కాబట్టి చక్కగా దుస్తులు వేసుకొని తయారై ఉండమని తన సవతి తల్లి తనకు చెప్పి మోసం చేసిందని ఆమె బాలల కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసింది.

మరోవైపు ఈ కేసులో బలమైన ఆధారాలతో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే బాధిత బాలికతో మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇప్పించాలని పోలీసులు నిర్ణయించారు. అలాగే, సవతి తల్లిపై కేసు పెట్టి అరెస్టు చేయాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+