‘కాళీ మాత’ను అగౌరపర్చేలా ఉక్రెయిన్ క్యారీకేచర్: భారత్ తీవ్ర ఆగ్రహం, ట్వీట్ డిలీట్, కానీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశ రక్షణ శాఖ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆరాధ్య దైవమైన 'కాళీ మాత'ను అగౌరవపరిచేలా వివాదాస్పద ట్వీట్ చేసి భారతీయుల ఆగ్రహానికి గురైంది. పెద్ద ఎత్తున భారతీయుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది ఉక్రెయిన్ రక్షణ విభాగం. అయితే, హిందువుల మనోభావాలను గాయపర్చి ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంపై భారతీయులు మండిపడుతున్నారు.
ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ షేర్ చేసిన కాళి దేవతను పోలిన కార్టూన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. 'ఇటీవల ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి భారతదేశం నుంచి మద్దతును కోరుతూ ఢిల్లీలో ఉన్నారు. దీని వెనుక ఉక్రెయిన్ ప్రభుత్వ అసలు ముఖం దాగి ఉంది. భారతీయ దేవత మా కాళి ప్రచార పోస్టర్‌పై వ్యంగ్య చిత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలపై దాడి' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత వెలువడిన ఓ పొగపై కాళీ మాతను తలపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఓ ఫొటోను ట్వీట్ చేసింది ఉక్రెయిన్ రక్షణ శాఖ. 'వర్క్ ఆఫ్ ఆర్ట్' అనే క్యాప్షన్‌తో స్టర్టు ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్ చేసింది. కాళీ మాతను పోలినట్లు ఈ ఫొటోను చిత్రీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, భారతీయులు ఉక్రెయిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recently #Ukraine Dy Foreign Minister was in Delhi soliciting support from #India
— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) April 30, 2023
Behind that fakery lurks the real face of Ukraine Govt. Indian goddess Ma Kali has been caricatured on a propaganda poster.
This is an assault on Hindu sentiments around the world.@UkrembInd https://t.co/r84YlsUtZc pic.twitter.com/q7jSG0vGXH
ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన వివాదాస్పద ట్వీట్‌పై స్పందిస్తూ.. జర్నలిస్ట్ శుభాంగి శర్మ ట్వీట్ చేశారు. "ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల మంది హిందువులను ద్వేషించడం, అపహాస్యం చేయడం బాధాకరం. యుద్ధ బాధితురాలిగా చెప్పుకునే దేశానికి ఇది తగదు. కాళీమాతను అపహాస్యం చేసే బదులు, అన్ని రకాల చెడులతో పోరాడేందుకు ఆమె ఆశీర్వాదం కోసం ప్రయత్నించండి. ఉక్రెయిన్ ప్రస్తుతం దీన్ని నిజంగా ఉపయోగించుకోవచ్చు' అని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భారతీయులు ఆరాధ్య దైవాన్ని అగౌరపర్చేలా వ్యవహరించడం ఆ దేశానికి మంచిది కాదని హితవు పలికారు.
Sad to see the government of Ukraine harbour such hate and mock more than a billion Hindus worldwide. It’s unbecoming of a country that claims to be a victim of war. Instead of deriding Kali Ma, try seeking her blessing to fight off evil of all kinds. Ukraine could really use it… pic.twitter.com/1Ke6DSQPw6
— Shubhangi Sharma (@ItsShubhangi) April 30, 2023
The official handle of the Ministry of Defence, Ukraine @DefenceU 🇺🇦 posted a highly insulting and hateful content today on Twitter portraying Hindu Godess Kali.
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) April 30, 2023
The tweet has been taken down after protests, but no apology has been issued, yet.#IADN pic.twitter.com/hONSvH4Cm7
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications