8నెలలుగా ఆమెపై రేప్: యూపీలో బయటపడ్డ మరో కీచక బాబా లీలలు..

సీతాపూర్‌లో బాబా శీయరామ్ దాస్ అనే బాబా ఓ మహిళపై ఆరు నెలల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.

లక్నో: డేరా బాబా, ఫలహారీ బాబా తరహాలో మరో నకిలీ బాబా ఉదంతం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో బాబా శీయరామ్ దాస్ అనే బాబా ఓ యువతి(21)పై ఎనిమిది నెలల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.

శీయారామ్ దాస్ మఠంతో పాటు సొంతంగా కాలేజీలు కూడా నిర్వహిస్తున్నాడు. ఆ కాలేజీల్లో చదివే అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో తన మేనేజర్ ఇంట్లో పరిచయం అయిన అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను బంధించాడు. అలా ఎనిమిది నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు.

Godman rapes girl for 8 months in captivity; arrested

బాబా చెర నుంచి తప్పించుకున్న అమ్మాయి.. అక్కడి నుంచి బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె బాబాయి కొడుకు ఆమెను రూ.50వేలకు బాబాకు విక్రయించాడని యువతి పోలీసులతో పేర్కొనడం గమనార్హం. అయితే ఆ దొంగ బాబా మాత్రం తనకేమి తెలియదని బుకాయిస్తున్నాడు.

ఒక్క రోజు క్రితమే ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడిందని, తన ఇంట్లో ఉంటానని అడిగితే వద్దని పంపించేశానని బాబా తెలిపాడు. పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+