శుభవార్త... ఈ కేంద్ర పథకంతో నెలకు 3వేలు మీ ఖాతాలో!
చాలామంది వయసు పైబడిన తర్వాత సంపాదన లేక ఆ సమయంలో చూసేవారు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే అటువంటి పరిస్థితి రాకుండా వయసు పైబడిన తర్వాత కూడా నెల నెల 3000 రూపాయలు అందించే ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ అనే పెన్షన్ పథకాన్ని అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం
ఈ పథకంలో 18 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎప్పుడైనా చేరవచ్చు. నెలవారి ఆదాయం 15 వేల కన్నా తక్కువగా ఉన్నవారు, ముఖ్యంగా కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెలా నెలకు 3000 చొప్పున పెన్షన్ అందుతుంది.

ఈ పథకంలో మీ పొదుపుకి సమానంగా ప్రభుత్వం సొమ్ము జమ
దీనికోసం కార్మికులు పథకంలో చేరిన నాటినుండి ప్రతినెల వారి వయసును బట్టి కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఇక కార్మికులు ఎంతైతే ఈ పెన్షన్ పథకంలో వేస్తారో దానికి సమానంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వం తరఫున నిధులను అందిస్తుంది. ఒకవేళ కార్మికుడు నెలకు 300 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం కూడా అదనంగా 300 రూపాయలు జమ చేస్తుంది.
ఈ స్కీమ్ లో వీరికి లబ్ది
ఈ పథకానికి కార్మికులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. బీడీ, చేనేత, తోలు, వ్యవసాయ, భవన నిర్మాణ, వీధి వ్యాపారులు, వివిధ కుల వృత్తులు చేసుకునే వారు, అసంఘటిత కార్మికులు ఎవరైనా సరే ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పథకం లబ్ధి పొందాలంటే వారు ఎన్పీఎస్, ఈఎస్ఐసీ స్కీమ్స్ లేదా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి ఇతర పెన్షన్ పథకాల లబ్ధిదారులుగా ఉండకూడదు.
60 ఏళ్ళ తర్వాత నెలకు మూడు వేలు
ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరాలి అనుకునేవారు తమ బ్యాంకు ఖాతాల ద్వారా ఆటో పే విధానంలో పథకానికి సొమ్ము చెల్లింపు చేయాలి. వయసును బట్టి సొమ్ము చెల్లింపు మారుతుంది. పథకంలో సొమ్ము పొదుపు 60 సంవత్సరాల వరకు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రతి నెల 3000 రూపాయలను వారి జీవిత చరమ అంకం వరకు పొందే అవకాశం ఉంటుంది.
వృద్ధాప్యంలో ఆర్ధిక భరోసా
మరెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకంలో పొదుపు చేసుకోవడానికి దగ్గరలో ఉన్న కామన్ సర్వీసెస్ సెంటర్స్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పెన్షన్ పథకం ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాతో హాయిగా గడపండి.












Click it and Unblock the Notifications