Google Bard:కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఆ పార్టీనే..గూగుల్ బార్డ్ జోస్యం అదుర్స్..!
Google Bard Karnataka assembly election results:కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు 2023 మే 13న విడుదల కానున్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కర్నాటకలో హంగ్ ఏర్పడుతుందని సూచించాయి. అంతేకాదు ప్రముఖ జ్యోతిష్యులు కూడా హంగ్ వస్తుందని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు జేడీఎస్ పార్టీతో చర్చోపచర్చలు జరిపినట్లు సమాచారం. ఇదంతా ఒకలా ఉంటే ది మోస్ట్ హ్యాపెనింగ్ టూల్ గూగుల్ బార్డ్ కూడా కర్నాటక ఫలితాలపై జోస్యం చెప్పింది.
"కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 మే 10వ తేదీన జరిగాయి. అయితే ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 113. కానీ మెజార్టీ సీట్లు దక్కించుకున్న అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేపీ 112 సీట్లు సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు, ఇతరులు ఒక సీటు సాధించాయి" అని గూగుల్ బార్డ్ జోస్యం చెప్పింది.

"బీజేపీ జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీజేపీ జేడీఎస్ పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. రెండు పార్టీలు అధికారాన్ని పంచుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. కేబినెట్‌లో బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా ఉంటుండగా.. జేడీఎస్ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. బీజేపీకి మెజార్టీ స్థానాలు వచ్చాయంటే అందుకు కారణం లింగాయత్ సామాజిక వర్గం. లింగాయత్‌ల మద్దతు బీజేపీకి పుష్కలంగా ఉన్నింది." అని గూగుల్ బార్డ్ జోస్యం చెప్పింది.
"బీజేపీ గెలుపునకు చాలా కారణాలున్నాయి. పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం కావడం, అభివృద్ధిపై ఫోకస్, ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ. మరోవైపు కాంగ్రెస్ విఫలం అవడానికి కొన్ని కారణాలున్నాయి. అవి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ప్రజలతో కనెక్ట్ కావడంలో ఫెయిల్ అవడం, ప్రజల్లో అంతగా గుర్తింపు పొందని రాష్ట్ర నాయకత్వం. ఇక జేడీఎస్ కర్నాటక తీరప్రాంతంలో అనుకున్న సీట్లు రాబట్టడంలో విఫలమైంది " అని గూగుల్ బార్డ్ గెలుపోటములపై విశ్లేషించింది.
2024 లోక్‌సభ ఎన్నికలకు కర్నాటక ఫలితాలు బీజేపీ క్యాడర్‌లో జోష్ పెంచిందని గూగుల్ బార్డ్ అభిప్రాయపడింది. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా రాబోయే 2024 సాధారణ ఎన్నికల తర్వాత మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోందంటూ గూగుల్ బార్డ్ చెప్పుకొచ్చింది. ఇక కాంగ్రెస్ ఎక్కడ విఫలమైందో ఆత్మపరిశీలన చేసుకుని ఓటర్ల మనసును గెల్చుకునేలా ముందుకు వెళ్లాలని గూగుల్ బార్డ్ సూచించింది.
గమనిక: పైన ఇచ్చిన కర్నాటక అసెంబ్లీ ఫలితాలు కేవలం గూగుల్ బార్డ్ చెప్పినవి. ఆ ఫలితాలకు వన్‌ఇండియాకు ఎలాంటి సంబంధం లేదు.












Click it and Unblock the Notifications