వావ్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి గూగుల్ జాబ్.. ఊహించని ప్యాకేజి

ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి ఏకంగా గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు, అదీకూడా నెలకు రూ.4 లక్షల స్టైఫండ్‌తో. అంతేకాదు, ఏడాది శిక్షణ తరువాత ఇతడు రూ.12 లక్షల వేతనం అందుకుంటాడు.

చండీగఢ్: ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి ఏకంగా గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు, అదీకూడా నెలకు రూ.4 లక్షల స్టైఫండ్‌తో. అంతేకాదు, ఏడాది శిక్షణ తరువాత ఇతడు రూ.12 లక్షల వేతనం అందుకుంటాడు.

ఈ అదృష్టవంతుడి పేరు హర్షిత్ శర్మ. చండీగఢ్‌లోని చండీగఢ్‌లోని 'గవర్నమెంట్‌ మోడల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌'లో 12వ తరగతి చదువుతున్నాడు. హర్షిత్‌కు చిన్నప్పటి నుంచీ గ్రాఫిక్‌ డిజైనింగ్‌ అంటే చాలా ఇష్టం.

Google offers job to class 12 govt school student with salary of Rs 12 lakh per month

పదో ఏట నుంచే హర్షిత్ తన మేనమామ రోహిత్‌ శర్మ వద్ద గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొందుతూ వచ్చాడు. ఆ తర్వాత అతనికి అదే లోకమైపోయింది. ఎలాగైనా గూగుల్‌లో జాబ్‌ సాధించాలనే లక్ష్యంతో కృషి చేశాడు.

తన పాఠశాల విద్యాభ్యాసం కొనసాగిస్తూనే బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల పోస్టర్లు డిజైన్‌ చేస్తూ నెలకు నలభై నుంచి యాభై వేలు సంపాదించేవాడు. ప్రధాని కార్యాలయం నిర్వహించిన 'డిజిటల్‌ ఇండియా' కార్యక్రమంలో కూడా హర్షిత్ తన సత్తా చాటి రూ.7000 రివార్డుగా పొందాడు.

గత డిసెంబరులో గూగుల్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. తాను ఇప్పటికే డిజైన్‌ చేసిన పోస్టర్లను గూగుల్‌ కార్యాలయనికి పంపాడు. అంతే.. హర్షిత్ రొట్టె విరిగి నేతిలో పడింది. ఆ పోస్టర్లు పరిశీలించిన గూగుల్ యాజమాన్యం... ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్‌ను అతడికి పంపించింది.

శిక్షణ కోసం ఈనెల 7వ తేదీన హర్షిత్ కాలిఫోర్నియాకు వెళ్లబోతున్నాడు. అక్కడ అతడికి ఏడాదిపాటు శిక్షణనిస్తారు. ఆ సమయంలో స్టైపెండ్‌గా నెలకు రూ.4 లక్షలు ఇస్తారు. ఏడాది తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగం రావడంతో తన కల నిజమైందని హర్షిత్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+