కస్ట్‌మర్స్‌కు షాకిచ్చిన గూగుల్ పే .. ఇకపై మీద దబిడి దిబిడే

యూపీఐ యాప్స్‌లో గూగుల్ పే కూడా ఒకటి. గూగుల్ పే అనేది గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ చెల్లింపుల వేదిక. దీనిని ఉపయోగించి మనం డబ్బు పంపవచ్చు, స్వీకరించవచ్చు, అలాగే వివిధ రకాల బిల్లులు చెల్లించవచ్చు. ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన చెల్లింపుల విధానం. గూగుల్ పే ఉపయోగించి స్నేహితులు ,టుంబ సభ్యులకు సులభంగా డబ్బు పంపవచ్చు..లేదా వారి నుండి స్వీకరించవచ్చు.దీని కోసం గూగుల్ పే ఖాతా లేదా బ్యాంక్ వివరాలను ఉపయోగించవచ్చు.గూగుల్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు మరియు ఇతర రకాల బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. అయితే ఇన్నాళ్లు ఫ్రీగా సేవలు అందించిన గూగుల్ పే , ఇకపై వినియోదారుల నుంచి రుసుము వసూలు చేయడానికి ఆ సంస్థ సన్నద్ధం అవుతోంది.

క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే బిల్ చెల్లింపులకు గూగుల్ పే కన్వేయన్స్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించటంతో చాలా మంది వినియోగదారులు షాక్ అవుతున్నారు. దీంతో ఇకపై గూగుల్ పే వినియోగదారులు ఇకపై కొన్ని బిల్లు చెల్లింపులపై రుసుము చెల్లించవలసి ఉంటుంది. గూగుల్ పే క్రెడిట్ ,డెబిట్ కార్డులను ఉపయోగించి చేసే లావాదేవీలకు ఛార్జీలను అమలు చేసింది.

Google pay to stop free UPI transactions

కొత్తగా ప్రవేశపెట్టిన రుసుము లావాదేవీ మొత్తంలో 0.5 నుండి 1 శాతం వరకు ఉంటుంది, వర్తించే GST కూడా ఉంటుంది. బ్యాంకు ఖాతాలకు నేరుగా లింక్ చేయబడిన UPI చెల్లింపులు ఉచితం అయితే, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా విద్యుత్ , వంట గ్యాస్ వంటి యుటిలిటీలకు చెల్లింపులు చేసే వినియోగదారులకు ఇప్పుడు ఛార్జ్ విధించబడుతుంది. ఈ మార్పుకు గల కారణాలు ఏమిటో గూగుల్ ఇంకా వెల్లడించలేదు, అయితే ఇది UPI చెల్లింపుల ప్రాసెసింగ్‌కు అయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి అయి ఉంటుందనే చర్చ సాగుతోంది.

ఛార్జీల వసూలు చేయడంతో దీని ప్రభావం వినియోగదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. ప్రత్యేకించి వారు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి బిల్లులు చెల్లించడానికి అలవాటు పడిన వారికి దీని ప్రభావం ఎక్కువ పడనుందని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+