Google services down: సడన్ గా నిలిచిన గూగుల్ సేవలు-యూట్యూబ్, జీమెయిల్, డ్రైవ్ అన్నీ..
భారత్ లో గూగుల్ సేవలు ఇవాళ సడన్ గా నిలిచిపోయాయి. గూగుల్ కు చెందిన యూట్యూబ్, జీమెయిల్, డ్రైవ్ వేల సంఖ్యలో యూజర్లకు ఓపెన్ కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఉదయం 11.22 గంటల నుంచి ఈ సేవల్లో ఆంతరాయం ఏర్పడినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
జీమెయిల్ (Gmail), యూట్యూబ్ (YouTube), గూగుల్ డ్రైవ్ (Google Drive) తో సహా గూగుల్ (Google)సేవలు భారతదేశంలోని ఎంతో మంది వినియోగదారులకు ఇవాళ అందుబాటులో లేవని తెలుస్తోంది. డౌన్‌డెటెక్టర్, దాని ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు సమర్పించిన ఎర్రర్‌లతో ఈ సమస్య అందరికీ తెలిసింది. గూగుల్ కు చెందిన ఇతర సేవల్లోనూ అంతరాగం కలుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.

ఉదయం 11.22 గంటల నుంచి వినియోగదారులు ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు డౌన్ డిటెక్టర్ ట్వీట్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వినియోగదారులు ఉత్పాదక కృత్రిమ మేథతో సహకరించడానికి ముందస్తు ప్రయోగంగా దాని ChatGPT పోటీదారు "Bard"కి యాక్సెస్‌ను తెరుస్తున్నట్లు Google నిన్న ఏ ప్రకటన చేసింది. బార్డ్‌కు ముందస్తు యాక్సెస్ యూఎస్, యూకేలో అందుబాటులోకి వచ్చింది. అలాగే త్వరలో మరిన్ని దేశాలు, భాషలకు దీని యాక్సెస్‌ను విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications