వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: తగ్గనున్న వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, ఏసీల ధరలు

కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌పై పన్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే నిత్యావసర సరుకుల వస్తువుల జీఎస్టీ ధరలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

గుజరాత్ ఎన్నికలు : తగ్గనున్న వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, ఏసీల ధరలు

న్యూఢిల్లీ: కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌పై పన్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే నిత్యావసర సరుకుల వస్తువుల జీఎస్టీ ధరలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. మరో వైపు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లపై కూడ పన్ను రేట్లను తగ్గించాలని భావిస్తోందని సమాచారం.

జిఎస్టీని అమలు చేసిన తర్వాత ఆయా రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మార్పుటు చేర్పులు చేయాలని జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో పలు స్లాబ్‌లో మార్పులు చేర్పులు చేశారు.

ఇటీవల గౌహతిలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. 28 శాతం పన్ను స్లాబ్‌లో కేవలం 50 శాతం వస్తువులను ఉండేలా నిర్ణయించారు.

ఈ నిర్ణయం కారణంగా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. అయితే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందనే ప్రచారం కూడ లేకపోలేదు.

వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లపై పన్ను తగ్గింపుకు యోచన

వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లపై పన్ను తగ్గింపుకు యోచన

ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్ను రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. వీటిపై పన్నును తగ్గించడం ద్వారా రానున్న రోజుల్లో వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం లేకపోలేదు. పన్ను ఎక్కువగా ఉన్నందున విక్రయాలు పడిపోయాయని ఉత్పత్తిదారులు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొనే దిశగా యోచిస్తోందని సమాచారం.

మహిళలే లక్ష్యంగా పన్ను తగ్గింపు

మహిళలే లక్ష్యంగా పన్ను తగ్గింపు

మహిళలను లక్ష్యంగా చేసుకుని పన్ను రేట్లను తగ్గించబోతున్నట్టు ఓ సీనియర్‌ ప్రభుత్వాధికారి చెప్పారు. ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడనుందన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించినట్టు పేర్కొన్నారు. మహిళలను ఆకర్షించే వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం వల్ల విక్రయాలు ఎక్కువగా సాగే అవకాశం ఉందంటున్నారు.

ఎలక్ట్రికల్ వస్తువులు 18 శాతానికే

ఎలక్ట్రికల్ వస్తువులు 18 శాతానికే

కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం కారణంగా ఎలక్ట్రిక్‌ వస్తువులు, కన్జ్యూమర్‌ డ్యూరెబుల్స్‌ పన్ను రేట్లు 18 శాతానికి దిగిరానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవి లగ్జరీ గూడ్స్‌గా పరిగణనలోకి రావని చెబుతున్నారు.అన్ని కన్జ్యూమర్‌ డ్యూరెబుల్స్‌ను ఒకే పన్ను 18 శాతం పరిధిలోకి తీసుకొస్తే, దేశీయ తయారీదారులకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

 పన్నుల పెంపుతో వస్తువుల విక్రయాలు తగ్గుదల

పన్నుల పెంపుతో వస్తువుల విక్రయాలు తగ్గుదల

పన్నుల పెంపు కారణంగా వస్తువుల విక్రయాలు తగ్గుతున్నాయని ఉత్పత్తిదారులు అభిప్రాయపడుతున్నారు. వస్తువుల విక్రయాలు తగ్గిపోతే పరిశ్రమలతో పాటు మార్కెటింగ్‌పై కూడ తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఉత్పత్తిదారులు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు పరిశ్రమలపై ప్రభావం పడకుండా ఉండేందుకు గాను కేంద్రం ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.

English summary
After consumer products and other daily-use items, the government is now looking to reduce goods and services tax (GST) on consumer durables like washing machines and refrigerators from the current level of 28% as part of the next round of rationalisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X