వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరిక: ఆ ఏడు రోజులు సెల్ఫీలు బంద్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతీయ స్మృతి చిహ్నాల ముందు సెల్ఫీలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. స్వాతంత్ర దినోత్స వేడుకల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు విధించింది.

స్వాతంత్ర దినోత్స వేడుకల సందర్బంగా ఆగస్టు 12 నుంచి 18వ తేది వరకు ఏ ఒక్కరూ జాతీయ చిహ్నాల ముందు సెల్ఫీలు తీసుకోకుండా నిబంధనలు అమలు చెయ్యాలని కేంద్ర పర్యాటక శాఖ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Govt Bans Selfies at National Monuments during Indepedence day week

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ప్రధాని మోడీకి ప్రమాదం పొంచి ఉందని ఇంటిలిజెన్స్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎర్రకోట చుట్టుపక్కల ఉన్న దాదాపు 3,100 చెట్ల వద్ద ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

అన్ని చోట్ల ప్రత్యేక సీసీ కెమెరాలు అమర్చారు. డ్రోన్ ల ద్వారా కూడా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు హెచ్చరించాయి.

English summary
The police and other security establishments believe that terrorists can launch attacks in the guise of tourists during Independence Day week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X