మీకు బైక్, కారు ఉందా? ఆర్సీ, లైసెన్స్ తదితర పత్రాల చెల్లుబాటు మార్చి 31 వరకు పొడిగింపు
బైక్, కారు సహా ఇతర వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటును కేంద్రం మరింత పొడిగించింది. కరోనా విలయం కొనసాగుతున్నందున పత్రాల రెన్యూవల్ లో ఇబ్బందులు నెలకొన్న కారణంగా వాటి చెల్లుబాటు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
కిమ్ శర్మ అందాల ఆరబోత.. ముదురు వయసులో ఏ మాత్రం తగ్గని గ్లామర్
కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. వాహన పత్రాల చెల్లుబాటులో పొడిగింపునకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు డైరెక్టరీని జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఇతర వాహన పత్రాలు మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో మోటారు వాహన పత్రాల పొడిగింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయడం ఇది నాలుగోసారి. 2020 ఫిబ్రవరి 1 నుంచి గడువు ముగిసిన, లేదా 2021 మార్చి 31 కి ముందే గడువు ముగిసిన అన్ని పత్రాలు 2021 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి.
సొగసులతో ఆకట్టుకొంటున్న క్యాథెరీన్ త్రెసా ఫోటోషూట్..
ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో "కొవిడ్-19 వ్యాప్తిని నివారించవలసిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాల చెల్లుబాటును పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి పరిస్థితి ఇంకా సాధారణం కాకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని మరింత పొడిగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలోని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
2021 మార్చి 31 వరకు ఇటువంటి పత్రాలను చెల్లుబాటు అయ్యేలా చూడాలని ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సూచించింది. రవాణా సంబంధిత సేవలను పొందడంలో పౌరులు, రవాణాదారులు, ఇతర సంస్థలకు ఈ పొడిగిపు నిర్ణయం సహాయపడనున్నది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications