Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంబేలెత్తిపోయిన బాలుడు... మహిళా టీచర్ లైంగిక వేధింపులు... వెలుగులోకి దారుణం...

ఓ మహిళా టీచర్ వద్ద మ్యాథ్స్ ట్యూషన్ కోసం వెళ్లిన బాలుడు ఆమె చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాడు. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఆ టీచర్ కామవాంఛతో అతని పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. ఆమె చేష్టలకు బెంబేలెత్తిపోయిన బాలుడు.. విషయం తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పరిధిలో ఉన్న జ్వాలాపూర్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. స్థానికంగా నివసించే ఓ మహిళ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్లు కూడా చెబుతోంది. ఈ క్రమంలో స్థానిక బాలుడు ఒకరు ఆమె వద్ద మ్యాథ్స్ ట్యూషన్ కోసం చేరాడు. అయితే సదరు మహిళా టీచర్ మాత్రం బాలుడికి లెక్కల పాఠాలు చెప్పాల్సిందిపోయి లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. ఈ నెల 21న బాలుడు ట్యూషన్ కోసం ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఆమె చేష్టలకు అతను బెంబేలెత్తిపోయాడు.

Govt school teacher booked under POCSO Act for molesting minor

టీచర్ తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం విద్యా శాఖ దృష్టికి వెళ్లడంతో ఆ టీచర్‌ను స్కూల్ నుంచి తొలగించారు. దీనిపై విచారణ పూర్తయి నిజానిజాలు తేలేంతవరకూ ఆమెపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందన్నారు.

గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ట్యూషన్ పేరుతో బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ టీచర్‌ను అరెస్ట్ చేసిన ఘటన రెండేళ్ల క్రితం చంఢీగఢ్‌లో చోటు చేసుకుంది. 34 ఏళ్ల ఆ మహిళా టీచర్‌ తన ఇంటి పక్కనే ఉండే 14 ఏళ్ల బాలుడిని లైం‍గికంగా వేధించింది. పదో తరగతి చదువుతున్న బాలుడికి, అతని చెల్లికి ఆమె రెండేళ్లుగా ట్యూషన్‌ చెప్తున్నారు. అయితే ఆ ఇద్దరినీ వేర్వేరుగా ట్యూషన్‌కు పంపించాలని కోరిన ఆ టీచర్... బాలుడు ఆమె వద్దకు వెళ్లిన సమయంలో లైంగికంగా వేధించినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+